వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 లక్షల మంది విద్యార్థుల గోస: ప్రశ్నపత్రం ధర రూ. 35 వేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారంలో సిబిఎస్ఈ నిర్లక్ష్యం వహించిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రశ్న పత్రం లీకైనట్లు ముందే తెలిసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పదో తరగతి లెక్కల పరీక్ష జరిగిన రోజు మార్చి 28వ తేదీ తెల్లవారు జామున 1.40 గంటలకు సిబిఎస్ఈకి ఈమెయిల్ వచ్చినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. చేతిరాతతో ఉన్న 12 ఇమేజేస్‌ను జత చేస్తూ ఆ ఈమెయిల్ వచ్చింది.

CBSE Ignored 2 Tip-Offs On Paper Leak, Probe Reveals

ప్రశ్నపత్రం లీకైందని పరీక్షకు ముందే తెలిసినప్పటికీ, చర్యలు తీసుకోవడానికి 9 గంటల వ్యవధి ఉన్నప్పటికీ పరీక్ష పూర్తయ్యేవరకు సిబిఎస్ఈ ఏ విధమైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో పోలీసులు 25 మందిని ప్రశ్నించారు. వారిలో 11 మంది స్కూల్ విద్యార్థులు ఉన్నారు. చరిత్రలోనే తొలిసారి సిబిఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను పోలీసులు ప్రశ్నించారు.

ప్రశ్న పత్రాలను తొలుత అందుకున్నవారు వటిని రూ.35 వేలకు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత దాని ధర రూ.5 వేలకు పడిపోయింది. ఢిల్లీలోని వేయి మంది విద్యార్థులకు ఆ పేపర్ చేరినట్లు తెలుస్తోంది.

English summary
Those who accessed the CBSE exam papers first reportedly charged Rs. 35,000. When parents allegedly resold it to other parents, the price dropped to Rs. 5,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X