వచ్చే ఏడాది నుంచి.. పదో తరగతిలో భారీ మార్పులు

వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 6 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 6 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ కింద వొకేషనల్ సబ్జెక్ట్ ను కంపల్సరీ సబ్జెక్టుగా ఆఫర్ చేస్తున్న స్కూళ్ల కోసం సీబీఎస్ఈ నూతన విధానాన్ని రూపొందించింది.

సీబీఎస్ఈ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. ప్రస్తుతం పదో తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. పిల్లలు రెండు లాంగ్వేజ్ లు, సైన్స్, సోషల్ సైన్స్, గణితం చదువుతున్నారు.

వీటితోపాటు అదనపు కోర్సుగా ఒక వొకేషనల్ సబ్జెక్టును చదివే అవకాశం ఇన్నాళ్లూ ఉండేది. అయితే వచ్చే 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఈ వొకేషనల్ కోర్సును చదవడం తప్పనిసరి చేశారు.

CBSE mandates six subjects for Class 10 boards from 2017 18

13 సబ్జెక్టుల్లో ఒకదానిని 6వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. సైన్స్, సోషల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ఏదైనా ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణులు కాకపోతే, దానికి బదులు వొకేషనల్ సబ్జెక్టును కలుపుతారు.

బోర్డు ఎగ్జామ్ రిజల్ట్ ను దానికి అనుగుణంగానే లెక్కిస్తారు. ఒకవేళ విద్యార్థి తాను తప్పిన సబ్జెక్టులో మళ్లీ పరీక్షకు హాజరుకావాలని కోరుకుంటే కంపార్ట్ మెంట్ లో రాసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+