వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 18న సీబీఎస్ఈ టర్మ్ 1 బోర్డు ఎగ్జామ్ డేట్ షీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఎస్​ఈ విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన ముఖ్య అప్‌డేట్ వచ్చింది. 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో ఎగ్జామ్స్ జరుగుతాయని, అందుకు సంబంధించిన డేట్​ షీట్​ అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్టు తెలిపింది.

90 నిమిషాల నిడివి గల ఎగ్జామ్స్.. ఆబ్జెక్టివ్​ విధానంలో ఉంటాయని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. ఉదయం 11:30కి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. కరోనా కారణంగా గతంలో.. 2021-22 అకడమిక్ ఇయర్‌కి మార్పులు చేసింది సీబీఎస్​ఈ. విద్యా సంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్​-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

CBSE Term 1 Board Exam Date Sheet On October 18.

ఇందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ ఛేంజస్ చేసింది. టర్మ్​-1 పరీక్షల తర్వాత మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్​ఈ ఎగ్జామ్​ కంట్రోలర్ నన్యమ్​ భరద్వాజ్ తెలిపారు​. పాస్​, కంపార్ట్​మెంట్​, రిపీట్​ కేటగిరీలో విద్యార్థులు ఉండరని చెప్పారు.

కాగా, రెండు టర్మ్​ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేస్తామని భరద్వాజ్ చెప్పారు. ఫస్ట్​ టర్మ్​ పరీక్షలకు ముందే, ఇంటర్నల్​ అసెస్​మెంట్లు, ప్రాక్టికల్​ పరీక్షలు పూర్తవుతాయని వెల్లడించారు. ఇందుకోసం 50శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. 2022 మార్చి-ఏప్రిల్​లో రెండో టర్మ్​ ఎగ్జామ్స్ జరిగే అవకాశమున్నట్టు భరద్వాజ్​ అభిప్రాయపడ్డారు.

English summary
CBSE Term 1 Board Exam Date Sheet On October 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X