ఈమె సీబీఎస్‌ఈ టాపర్: చదువుల సరస్వతిపై కామాంధుల కాటు

హర్యాణాలో దారుణం చోటు చేసుకుంది. చదువుల సరస్వతిపై కామాంధులు కాటేశారు. మృగాల కంటే దారుణంగా ప్రవర్తించారు. కామంతో కళ్లు మూసుకునిపోయి కనీస విచక్షణ లేకుండా పశువుల్లా ప్రవర్తించారు. అమ్మాయి స్పృహ కోల్పోయే వరకు అత్యాచారం చేశారు. అనంతరం సమీప బస్టాండులో ఆమెను పడేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.... హర్యాణాలో 19 ఏళ్ల కాలేజీ యువతిని గుర్తుతెలియని వారు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. యువతి సొంత గ్రామం రేవారికి దగ్గరలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేవారు. జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అప్పటికే అక్కడ మరో కొందరు వ్యక్తులు వేచి ఉన్నారు. వారు కూడా యువతిని దారుణంగా రేప్ చేశారు. అనంతరం యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెను బస్టాండు సెంటర్‌లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కంప్లయింట్‌ను స్వీకరించలేదని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వారు వెళ్లినట్లు చెప్పారు.

CBSE topper gang raped in Haryana

సీబీఎస్‌ఈ నిర్వహించిన బోర్డు పరీక్షలో బాధిత యువతి టాపర్‌గా నిలిచింది. ఆ చదువుల సరస్వతి ప్రధాని మోడీ అభినందించారని తల్లిదండ్రులు చెప్పారు. మోడీ భేటీ పడావో భేటీ బచావో అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. కానీ మృగాళ్లు ఉన్న ఈ సమాజంలో అది ఎలా సాధ్యమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురుకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేరం జరిగనట్లు భావిస్తున్న స్థలం... యువతి ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని అందువల్లే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని అక్కడ ఫిర్యాదు నమోదు చేస్తామని చెప్పారు. అలాగే ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారు తమ గ్రామానికి చెందిన వారేనని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు. పోలీసులు ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+