పబ్ లో నిర్బంధించి అర్దనగ్నంగా డ్యాన్స్ లు

బెంగళూరు: యువతులకు అశ్లీలంగా ఉన్న దుస్తులు వేసి బార్ లో, పబ్ లో డ్యాన్స్ లు వేయిస్తు మద్యం సరఫరా చేయిస్తున్న 40 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నిర్బంధించిన 36 మంది యువతులను రక్షించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలో లెస్ ఫ్యామిలి బార్ అండ్ రెస్టారెంట్, పబ్ ఉంది. ఇక్కడికి నిత్యం శ్రీమంతులు వెళుతుంటారు. వీకెండ్ లో సరేసరే. ఈ పబ్ లో యువతులను నిర్బంధించి బలవంతంగా వారి చేత మద్యం సరఫరా చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

 ccb police ride in less family restaurant and pub in bangalore.

కచ్చితమైన వివరాలు సేకరించిన సీసీబీ పోలీసులు శుక్రవారం అర్దరాత్రి పబ్ మీద దాడి చేశారు. ఆ సందర్బంలో అక్కడ ఉన్న 36 మంది యువతులు అర్దనగ్నంగా దుస్తులు వేసుకుని డ్యాన్స్ లు చేస్తు మద్యం సరఫరా చేస్తున్న విషయం గుర్తించారు.

వెంటనే 40 మందిని అరెస్టు చేసి నగదు, మొబైల్ లు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 36 మంది యువతులను పోలీసులు రక్షించారు. పబ్ యజమాని కుమార్, కట్టడం యజమాని నయిముద్దీన్, మేనేజర్ షాజీద్ తప్పించుకున్నారని సీసీబీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+