పోలీసే దొంగగా మారి దొరికిపోయాడు(వీడియో)
శ్రీనగర్: దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీసు అధికారి దొంగగా మారిపోయాడు. తనిఖీల నిమిత్తం వీధిలో తిరుగుతూ షాపుల ముందున్న సిఎఫ్ఎల్ బల్బులను దొంగతనం చేశాడు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వికాస్ ఖజురియా జమ్ములోని నానక్ నగర్ ప్రాంతంలో ఓ షాపు ముందు ఉన్న సీఎఫ్‌ఎల్ బల్బ్‌ను దొంగలించాడు.
అయితే ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో విస్తృతంగా ప్రచారమైంది.

కాగా, సమాచారమందుకున్న పోలీసులు వికాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గత కొంత కాలంగా వికాస్ మానసిక పరిస్థితి సరిగా లేదని, కేసుపై విచారణ చేపడుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.












Click it and Unblock the Notifications