VG Siddhartha Missing: చివరిసారిగా సిద్ధార్థ కనిపించింది ఎక్కడంటే..?
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ఆ రెస్టారెంట్ల అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో కీలక సాక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. నల్లరంగు టయోటా ఇన్నోవా కారులో సోమవారం సాయంత్రం సకలేశపురా మీదుగా బెంగళూరు నుంచి మంగళూరుకు చేరుకున్న సిద్ధార్థ టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదయ్యాయి.
మంగళూరు నగర శివార్లలోని బీసీ రోడ్డుపై నెలకొల్పిన టోల్ గేట్ వద్ద అమర్చిన సీసీటీవీల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. మంగళూరు నగర పోలీసులు దీన్ని తాజాగా మీడియాకు విడుదల చేశారు. నేత్రావతి బ్రిడ్జి మీదికి దారి తీసే రోడ్డుపై ఈ టోల్ గేట్ ఉంది.

సాయంత్రం 7: 30 గంటల సమయంలో సిద్ధార్థకు చెందిన నల్లరంగు టయోటా ఇన్నోవా కారు ఈ టోల్ గేట్ ను దాటుకుని వెళ్లడం కనిపించింది. కారు ఈ టోల్ గేట్ ను దాటుకుని వెళ్లిన కొద్దిసేపటికే సిద్ధార్థ అదృశ్యం అయ్యారు. పరవళ్లు తొక్కుతున్న నేత్రావతి నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖను పోలీసులు కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. 18 గంటలుగా పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, నౌకాదళ సిబ్బంది, తీర ప్రాంత రక్షక బలగాలు సిద్ధార్థ కోసం గాలిస్తున్నప్పటికీ.. ఆయన జాడ తెలియ రాలేదు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications