సిసిటివి ఫుటేజ్‌లు తేజ్‌పాల్‌ను పట్టిస్తున్నాయా?
పానాజీ: తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ చిక్కులో పీకల్లోతు ఇరుక్కున్నట్లే. మహిళా జర్నలిస్టుతో కలిసి లిఫ్ట్‌లోకి తరుణ్ తేజ్‌పాల్ ఎక్కుతున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. సిసిటివి ఫుటేజ్ దృశ్యాలు మహిళా జర్నలిస్టు చెబుతున్న విషయాలతో సరిపోలుతున్నట్లు గోవా పోలీసులు అంటున్నారు.
ఎలివేటర్‌కు వెలుపల ఉన్న సిసిటివీలో తరుణ్ తేజ్‌పాల్ ఆ మహిళా జర్నలిస్టుతో కలిసి వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. నవంబర్ 7,8 తేదీల్లో థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళా జర్నలిస్టు ఆరోపించిన విషయం తెలిసిందే.

హోటల్ ఏడో బ్లాక్ వెలుపల ఉన్న లిఫ్ట్‌లో తప్పు జరిగిందనే విషయాన్ని సిసిటివి దృశ్యాలు పట్టిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డే నీరోను తేజ్‌పాల్, బాధిత మహిళ అనుసరిస్తున్న తొలి టీవి ఫుటేజ్‌లు చూపిస్తున్నాయని, ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో తరుణ్ తేజ్‌పాల్ మహిళ భుజాలపై చేతులు లిఫ్ట్‌లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలున్నాయని పోలీసులు అంటున్నారు.
ఆ తర్వాత రాత్రి పదిన్నర గంటలకు అదే ఎలివేటర్ వద్ద తరుణ్ తేజ్‌పాల్ బాధిత మహిళను గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్‌లోకి లాగుతున్న దృశ్యం రికార్డయిందని వారంటున్నారు. ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత రెండో అంతస్థులో లిఫ్ట్ తెరుచుకుందని చెబుతున్నారు.
ఎలివేటర్‌ను తన దుస్తులను సరిచేసుకుంటూ బయటకు వచ్చి కిందికి మెట్ల ద్వారా పరుగులు తీయడం కనిపించిందని, ఆమెను తేజ్‌పాల్ అనుసరిస్తూ కనిపించాడని అంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications