CD Girl: అపార్ట్ మెంట్ లో చెయ్యకూడనవి A to Zచేశాడు, సుందరి రివర్స్ కేసు, మాజీ మంత్రి !
బెంగళూరు/ ముంబాయి: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల కేసు రసవత్తరంగా మారిపోయింది. 24 రోజుల పాటు అజ్ఞాతంలో అంటూ అందర్ని అయోమయానికి గురి చేసిన సీడీ గర్ల్ ఎట్టకేలకు మాజీ మంత్రి మీద పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. నన్ను అపార్ట్ మెంట్ కు పిలిచాడు, నాతో అన్నీ చేశాడు, చెయ్యకూడని పనులు అన్నీ తనతో చేయించి నాశీలం దోచుకుని నా జీవితం నాశనం చేశాడు. మంత్రి పదవి, అధికారం అడ్డం పెట్టుకుని వీడియో నగ్నంగా కనపడాలని చెప్పినాతో చాలా చేయించాడని సీడీ గర్ల్ మాజీ మంత్రి మీద రివర్స్ గేర్ వెయ్యడంతో కథ కొత్తమలుపు తిరగడమే కాకుండా రసవత్తరంగా మారిపోయింది.
Killer:
ముగ్గురు
భార్యలు,
మూడు
హత్యలు,
ఎర్రగులాబీల
కమల్
హాసన్
వేస్ట్,
ఆంటీ
దెబ్బ
!

సీడీ గర్ల్ ఎస్కేప్
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, బెంగళూరులోని ఆర్ టీ నగర్ పీజీ సుందరి రాసలీలల సీడీ లీక్ అయ్యి 24 రోజులు అయ్యింది. రాసలీలల సీడీ విడుదల కావడంతో కర్ణాటక మంత్రి రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాసలీలల సీడీ విడుదలైన తరువాత సీడీ గర్ల్, పీజీ సుందరి మాయం అయిపోయింది.
లాయర్ ఎంట్రీతో రసవత్తరం
శుక్రవారం మద్యాహ్నం సీడీ గర్ల్ తరపు న్యాయవాది జగదీష్ కుమార్ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో అడుగుపెట్టడంతో మాజీ మంత్రి రాసలీలల సీడీ కథ రసవత్తరంగా మారిపోయింది. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తన జీవితాన్ని నాశనం చేశాడని పీజీ సుందరి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పత్రాలను ఆమె న్యాయవాది జగదీష్ కుమార్ బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ కు అందించి ఫిర్యాదు చేశారు.

కమీషనర్ ఏం చెప్పారంటే ?
సీడీ కేసు అమ్మాయి చేసిన ఫిర్యాదు పత్రాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు పోలీసు కమీషనర్ కమల్ పంత్ బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ అనుచేత్ కు సూచించారు. ఇప్పటికే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేపన్ లో సీడీ సుందరి తరుపున కేసు నమోదు కావడంతో ఆ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆమె న్యాయవాది జగదీష్ కుమార్ మళ్లీ సీడీ గర్ల్ ఫిర్యాదు పత్రాలను ఇచ్చి కేసు పెట్టారు.

సిట్ అధికారులు ఎంట్రీ
మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ కేసును కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సిట్ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిట్ అధికారులు రాసలీలల సీడీ గర్ల్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు సీడీ గర్ల్ నేరుగా న్యాయవాదితో బెంగళూరు పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సిట్ అధికారులు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ ను కలిసి ఆయనతో క్షుణ్ణంగా చర్చించిన తరువాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అపార్ట్ మెంట్ లో అన్నీ చేశాడు
మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీలో ఉందని ప్రచారం జరిగిన యువతి శుక్రవారం మాజీ మంత్రి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఆయన మీద రివర్స్ కేసు పెట్టడం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నన్ను రెండుమూడు సార్లు అపార్ట్ మెంట్ కు పిలిపించుకున్నాడని సీడీ సుందరి ఆరోపించింది. అపార్ట్ మెంట్ లో నాతో చెయ్యకూడని పనులు అన్నీ చేయించి నాశీలం దోచుకున్నాడని సీడీ సుందరి ఫిర్యాదులో వివరించింది.

ప్రైవేట్ పార్ట్స్ తో రెచ్చగొట్టారు
తనను నగ్నంగా వీడియోలో కనిపించాలని రమేష్ జారకిహోళి బలవంతం చేశాడని, నా ప్రైవేట్ పార్ట్స్ అన్నీ చూపించాలని రెచ్చగొట్టి బలవంతం చేసి వీడియోలు తీశాడని సీడీ సుందరి ఆరోపిస్తూ కేసు పెట్టింది. మంత్రి పదవి, అధికారం అడ్డం పెట్టుకుని నేను వీడియోలో నగ్నంగా కనపడాలని చెప్పి నాతో చెయ్యకూడని పనులు చాలా చేయించాడని సీడీ గర్ల్ ఆరోపించింది.

రెండు సార్లు లైంగికదాడి ?
తనను అపార్ట్ మెంట్ లోకి పిలుపించుకుని రెండుసార్లు లైంగిక దాడి చేశాడని. ఉద్యోగం వస్తుందని ఆశతో తాను ఇంతకాలం మౌనంగా మంత్రి చెప్పినట్లు చేశానని సీడీ సుందరి ఆమె పెట్టిన కేసులో వివరించింది. సీడీ గర్ల్ మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద రివర్స్ కేసు పెట్టడంతో కథ కొత్తమలుపు తిరగడమే కాకుండా స్టోరీ రసవత్తరంగా మారిపోయింది.