CD Girl: మాజీ మంత్రి రాసలీలల ఎఫెక్ట్, పీజీ సుందరి ఇంట్లో అన్ని లక్షలా ?, బీర్లు, వైన్, వామ్మో !

బెంగళూరు/ బెళగావి: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించి మాయం అయిన సీడీ గర్ల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. రాసలీలల సీడీ గర్ల్ బెంగళూరులోని ఇంట్లో లక్షలు లక్షల నోట్ల కట్టలు, బీర్లు, వైన్ బాటిల్స్, విలువైన పత్రాలు బయటపడటంతో ఎస్ఐటీ అధికారులు షాక్ అయ్యారు. బెంగళూరుతో పాటు విజయపుర తదితర ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు నోట్ల కట్టలతో పాటు లక్షల రూపాయల విలువైన బ్యాంకు చెక్ లు, డీడీలతో పాటు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన జీవితం నాశనం చేసి తనతో రాసలీలలు సాగించాడని సీడీ గర్ల్ ఆరోపణలు రావడంతో బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దెబ్బకు ఆ రోజు మాయం అయిన సీడీ గర్ల్ ఈ రోజు వరకు ఎవ్వరి కంటాపడకుండా తప్పించుకుని తిరుగుతోంది.

అద్దె ఇంట్లో రూ. 23 లక్షలా ?

అద్దె ఇంట్లో రూ. 23 లక్షలా ?

మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ సుందరి బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. సీడీ గర్ల్ నివాసం ఉంటున్న ఇంటిలో ఎస్ఐటీ అధికారులు సోదాలు చేశారు. సీడీ గర్ల్ ఇంట్లో అధికారులు ఏకంగా రూ. 23 లక్షల నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారని వెలుగు చూసింది.

బీర్లు, వైన్ బాటిల్స్ సీజ్ ?

బీర్లు, వైన్ బాటిల్స్ సీజ్ ?

ఆర్ టీ నగర్ లోని పీజీ సుందరి ఇంటిలో అధికారులు రూ. 23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారని వెలుగు చూడటంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఉద్యోగం కావాలని మంత్రి వెంట తిరిగిన పీజీ సుందరి ఇంటిలో ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ?, ఎవరు ఇచ్చారు ? అంటూ చర్చ మొదలైయ్యింది. పీజీ సుందరి ఇంటిలో అధికారులు బీర్ బాటిల్స్, వైన్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

 ఉద్యోగం కోసం వెంటపడితే ఇలా చేశారు

ఉద్యోగం కోసం వెంటపడితే ఇలా చేశారు

తనకు ఉద్యోగం ఇప్పించాలని మంత్రి హోదాలో ఉన్న రమేష్ జారికిహోళి దగ్గరకు వెళ్లానని, ఆ సమయంలో తనతో బలవంతంగా రాసలీలలు సాగించారని పీజీ సుందరి ఆరోపిస్తున్నది. తనతో కామవాంఛ తీర్చుకున్న తరువాత రమేష్ జారకిహోళి ఆ సెక్స్ సీడీ రికార్డు చేసి తన జీవితం నాశనం చెయ్యడానికి ఆ సీడీని ఆయనే విడుదల చేయించాడని పీజీ సుందరి ఆరోపిస్తున్నది.

 పీజీ సుందరి రివర్స్ అయితే ?

పీజీ సుందరి రివర్స్ అయితే ?

విచారణకు హాజరుకావాలని పీజీ సుందరి ఇంటికి నోటీసులు అంటించినా, ఆమెకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినా ఇంత వరకు ఎలాంటి స్పందనలేదని ఎస్ఐటీ అధికారులు అంటున్నారు. రాసలీలల సెక్స్ సీడీ విడుదలైన తరువాత పీజీ సుందరి మాయం అయిపోయింది. అయితే మంత్రి నా జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తున్న పీజీ సుందరి ప్రత్యక్షమై మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి మీద అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెడితే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉందని కొందరు న్యాయనిపుణలు అంటున్నారు.

రిపోర్టర్ ఇంటిలో సోదాలు

రిపోర్టర్ ఇంటిలో సోదాలు

మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీడీ గర్ల్ ఇంటితో పాటు ఇదే కేసులో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మాజీ రిపోర్టర్ ఇంటిలో అధికారులు సోదాలు చేశారు. సీడీ గర్ల్ ఇంటిలో, మాజీ రిపోర్టర్ ఇంటిలో లక్షల రూపాయలతో పాటు విలువైన పత్రాలు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐటీ అధికారులు అంటున్నారు.

హ్యాకర్ ఇంటిలో రూ. 40 లక్షల చెక్ లు, డీడీలు

హ్యాకర్ ఇంటిలో రూ. 40 లక్షల చెక్ లు, డీడీలు

మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, సీడీ సుందరి రాసలీలల సీడీ కేసులో ప్రముఖ హ్యాకర్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయపురలోని వ్యక్తి ఇంటిలో ఎస్ఐటీ అధికారులు సోదాలు చేశారు. హ్యాకర్ ఇంటిలో రూ. 40 లక్షల విలువైన డీడీలు, బ్యాంక్ చెక్ లు, విలువైన పత్రాలు సీజ్ చేశారని తెలిసింది.

 ఆ ముగ్గురు ఎక్కడ ?

ఆ ముగ్గురు ఎక్కడ ?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, సీడీ సుందరి రాసలీలల పోర్న్ సీడీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో అధికారులు హడలిపోతున్నారు. సీడీ విడుదలైన తరువాత మాయం అయిన సీడీ సుందరి, మాజీ రిపోర్టర్, హ్యాకర్ కోసం ఎస్ఐటీ అధికారులు గాలిస్తున్నా వారి ఆచూకి మాత్రం చిక్కడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+