వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CD Girl scandal: మాజీ మంత్రి రాసలీలలు, సిట్ ఆఫీస్ లో లీకువీరులు, ఆ రోజు ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల కేసు రసవత్తరంగా మారింది. సీడీ గర్ల్ వ్యవహారంలో మాజీ మంత్రి రమేస్ జారకిహోళిని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి, సీడీ గర్ల్ రాసలీలల సీడీ బయటకు వచ్చినప్పటి నుంచి మాయం అయిన నిందితులు ఇద్దరికి కోర్టు షరులతో బెయిల్ మంజూరు చెయ్యడంతో కేసు విచారణ రసవత్తరంగా మారింది. బెయిల్ రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు శనివారం బెంగళూరులోని ఎస్ఐటీ అధికారుల ముందు హాజరైనారు. సిట్ అధికారుల ముందు ఆ ఇద్దరు ఏమి స్టేట్ మ్మెంట్ ఇచ్చారో ? అనే విషయం ఆసక్తికరంగా మారింది. సిట్ ఆఫీసులోకి వెళ్లిన ఇద్దరూ ఇంకా బయటకు రాకపోవడంతో మాజీ మంత్రి రమేష్ జారకిహోళి వర్గీయుల్లో టెన్షన్ మొదలైయ్యింది.

Illegal affair: భర్త జైల్లో, భార్య, ప్రియుడు 24 x7, ఫోన్లో మ్యాటర్ లీక్ చేసిన కూతుర్లు !Illegal affair: భర్త జైల్లో, భార్య, ప్రియుడు 24 x7, ఫోన్లో మ్యాటర్ లీక్ చేసిన కూతుర్లు !

 నా జీవితనం నాశనం చేశాడు

నా జీవితనం నాశనం చేశాడు

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, బెంగళూరులోని ఆర్ టీ నగర్ పీజీ సుందరి రాసలీలల సీడీ బయటకు రావడం కలకలం రేపింది. రాసలీలల సీడీ వ్యవహారం బయటకు వచ్చిన తరువాత రమేప్ జారకి హోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని తన జీవితనం నాశనం చేశాడని పీజీ సుందరి రమేష్ జారకిహోళి మీద కేసు పెట్టింది. అప్పటి నుంచి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది.

బ్లాక్ మెయిల్ చేసి రూ. కోట్లు డిమాండ్ చేస్తున్నారు ?

బ్లాక్ మెయిల్ చేసి రూ. కోట్లు డిమాండ్ చేస్తున్నారు ?

ఆర్ టీనగర్ పీజీ సుందరితో పాటు నరేష్ గౌడ, శ్రావణ్ కుమార్ అనే ఇద్దరు తనను భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే తన పరువు బజారుకు ఈడుస్తామని, నా రాజకీయ జీవితానికి మచ్చ తీసుకువస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి రమేష్ జారకిహోళి బెంగళూరు నగరంలోని సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. బ్లాక్ మెయిల్ కేసు నమోదు అయిన వెంటనే రాసలీలల వీడియోలు విడుదల చేసిన శ్రావణ్ కుమార్, నరేష్ గౌడ పరారైనారు.

కోర్టు ఆదేశాలతో ఇద్దరూ !

కోర్టు ఆదేశాలతో ఇద్దరూ !

పోలీసులకు కనపడకుండా తప్పించుకుని తరిగిన శ్రావణ్ కుమార్, నరేష్ గౌడకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక నుంచి పారిపోయిన ఇద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నారని తెలిసింది. బెంగళూరు 91వ సిటి సివిల్ కోర్టు న్యాయస్థానం బ్లాక్ మెయిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేష్ గౌడ, శ్రావణ్ కుమార్ లకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
సిట్ అధికారుల ముందు కచ్చితంగా హాజరుకావాలని కోర్టు ఇద్దరికి సూచించింది.

ఎంట్రీ ఇచ్చారు..... ఏం చెప్పారో ?

ఎంట్రీ ఇచ్చారు..... ఏం చెప్పారో ?


ముందస్తు బెయిల్ మంజూరు రావడంతో శ్రావణ్ కుమార్, నరేష్ గౌడ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. శనివారం బెంగళూరులోని ఆడుగోడిలోని సిట్ కార్యాలయంలో శ్రావణ్ కుమార్, నరేష్ గౌడ హాజరైనారు. మాజీ మంత్రి రమేష్ జారకిహోళి పెట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ఎస్ఐటీ అధికారుల ముందు ఏమి స్టేట్ మ్మెంట్ ఇచ్చారో ? అనే విషయం ఆసక్తికరంగా మారింది. శనివారం సాయంత్రం వరకు ఇద్దరిని సిట్ అధికారులు విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది.

English summary
CD Girl: Ramesh Jarkiholi sex scandal video case Naresh and Shravan attends SIT interrogation in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X