CD Scandal: రాసలీలల కేసు, కోర్టు క్యాంపస్ లో సీన్ రివర్స్, జడ్జ్ ముందు సీడీ లేడీ స్టేట్ మెంట్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి రాసలీలల కేసు కొత్త మలుపు తిరిగింది. తన మీద మాజీ మంత్రి అత్యాచారం చేసి దానిని సీడీ తీశాడని కేసు పెట్టిన యువతి న్యాయమూర్తి ముందు రహస్యంగా స్టేట్ మెంట్ ఇచ్చింది. బెంగళూరు ఏసీఎంఎం కోర్టుకు వచ్చి సీడీ లేడీ స్టేట్ మెంట్ ఇస్తుందని తెలియడంతో మీడియా, పోలీసులు, లాయర్లు, వందలాది మంది ప్రజలు కోర్టు ఆవరణంలో ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. చివరి నిమిషంలో న్యాయమూర్తి లేడీ టైపిస్టును వెంట పెట్టుకుని ప్రత్యేక కోర్టు దగ్గరకు బయలుదేరడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

కోర్టులో టెన్షన్ టెన్షన్

కోర్టులో టెన్షన్ టెన్షన్

బెంగళూరు ఏసీఎంఎం కోర్టుకు వచ్చి సీడీ లేడీ స్టేట్ మెంట్ ఇస్తుందని తెలియడంతో మీడియా, పోలీసులు, లాయర్లు, వందలాది మంది ప్రజలు కోర్టు ఆవరణంలో ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. మంగళవారం మద్యాహ్నం 3.30 గంటలకు సీడీ లేడీ న్యాయమూర్తి ముందు హాజరుకావాలని కోర్టు సూచించింది. సీడీ లేడీని చూడాలని కోర్టు ఆవరణంలో అందరూ చాలా టెన్షన్ గా ఎదురు చూశారు.

అర్దగంట ముందు సీన్ రివర్స్

అర్దగంట ముందు సీన్ రివర్స్

మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో ఎవ్వరికీ తెలీకుండా బెంగళూరు ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి లేడీ టైపిస్టు కల్పనాను వెంట పెట్టుకుని వసంతనగర్ లోని గురునానక్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు దగ్గరకు బయలుదేరి వెళ్లిపోయారు. న్యాయమూర్తి ప్రత్యేక కోర్టు దగ్గరకు వెళ్లి సీడీ లేడీ దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నారని తెలియడంతో అంత వరకు కోర్టు ఆవరణంలో ఉన్న పోలీసులు, లాయర్లు, సామన్య ప్రజలు షాక్ గురై ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

గుండెల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు

గుండెల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు

బెంగళూరులోని వసంతనగర్ లోని గురునానక్ భవన్ లోని ప్రత్యేక కోర్టులో హాజరైన సీడీ లేడీ సీక్రెట్ గా న్యాయమూర్తికి వాగ్మూలం ఇవ్వడంతో మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో పాటు ఆయన అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె న్యాయమూర్తికి ఏం చెప్పారు అనే విషయం కోర్టు సీక్రెట్ గా పెడుతుంది. సీడీ లేడీ ఏం చెబుతుందో ? అనే విషయం ఎవ్వరికీ అంతు చిక్కకపోవడంతో ఎవరికివారు తోచినట్లు ఊహించుకుంటున్నారు.

 అంచనాలు తారుమారు.... అదే జరిగింది

అంచనాలు తారుమారు.... అదే జరిగింది

మొదట మేము ఆమె ఏం చెబుతుందో దానిని చట్టపరంగా రికార్డు చేసుకుంటాము, తరువాత ఆమె ప్రత్యేక ద్యాప్తు సంస్థ (SIT) అధికారుల ముందు స్టేట్ మెంట్ ఇవ్వడానికి అవకాశం ఇస్తామని మంగళవారం ఉదయం కోర్టు చెప్పింది. అందరూ అనుకున్నట్లు సీడీ లేడీ ఏసీఎంఎం కోర్టుకు రాకుండా ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావడంతో అందరి అంచనాలు తారుమారైనాయి.

 రెండు కేసులు సిట్ చేతిలోకి

రెండు కేసులు సిట్ చేతిలోకి

సీడీ సుందరి మీద మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఇప్పటికే సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, మాజీ మంత్రి మీద సీడీ అమ్మాయి తన మీద అత్యాచారం చేశాడని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కేసు, సీడీ లేడీ కేసులు ఇప్పుడు సిట్ కు బదిలి అయ్యాయి. మొత్తం మీద 29 రోజుల తరువాత సీడీ లేడీ కోర్టు ముందు ప్రత్యేక్షం కావడంతో కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారికిహోళి రాసలీలల సీడీ వ్యవహారం ఉత్కంఠకు తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+