CD scandal: సీడీ సుందరి ఆడియో లీక్, డీకేశీ పేరుతో కలకలం, రాసలీలలు, గ్రాఫిక్స్, ట్విస్ట్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల కేసులో మరో ట్విస్ట్ తెరమీదకు రావడంతో సెక్స్ స్కాండిల్ సీడీ గర్ల్ కేసుకు రాజకీయ రంగు అంటుకుంది. సీడీ గర్ల్ ఫోన్ చేసిన ఆడియో టేప్ లీక్ కావడంతో కలకలం రేపింది. కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ మనకు సహాయం చేస్తారని ఆ సీడీ గర్ల్ ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. తన రాజకీయ జీవితం నాశనం చెయ్యడానికి ఓ పముఖ 'మహానాయకుడు ' స్కెచ్ వేశాడని ఇంతకాలం చెబుతున్న వచ్చిన రాసలీలల సీడీలోని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఆరోపణలు ఇప్పుడు నిజయం అయ్యేటట్లు ఉన్నాయి.

 సీన్ రివర్స్

సీన్ రివర్స్

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల వీడియో విడుదలైన తరువాత ఆ సీడీ సుందరి మాయం అయ్యింది. 24 రోజుల తరువాత శుక్రవారం మద్యాహ్నం సీడీ సుందరి ఆమె తరపు న్యాయవాది జగదీష్ తో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ కు ఫిర్యాదు చేసి మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద రివర్స్ కేసు పెట్టడం కలకలం రేపింది.

 ఆడియో లీక్ కలకలం

ఆడియో లీక్ కలకలం

మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద సీడీ సుందరి కేసు పెట్టిన కొన్ని గంటల్లోనే కన్నడ మీడియాకు ఓ ఆడియో టేప్ లీక్ అయ్యింది. సీడీ సుందరి ఆమె కుటుంబ సభ్యులతో 6 నిమిషాల 59 సెకన్ల పాటు మాట్లాడిన ఆ ఆడియో మీడియాలో రావడం కలకలం రేపింది. సీడీ సుందరి ఆమె తల్లి, సోదరుడితో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆ ఆడియో ఉంది.

 డీకే. శివకుమార్ పేరుతో కలకలం

డీకే. శివకుమార్ పేరుతో కలకలం

సీడీ సుందరి ఆమె తల్లితో, సోదరుడు చిన్నితో మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండాలని, మనకు డీకే శివకుమార్ (కేపీసీసీ అధ్యక్షుడు) అనుచరులు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆ సీడీ సుందరి విచారంతో కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉంది.

 సెక్స్ సీడీ వీడియోలో నేను కాదు... గ్రాఫిక్స్ చిన్ని

సెక్స్ సీడీ వీడియోలో నేను కాదు... గ్రాఫిక్స్ చిన్ని

సోదరుడు చిన్నీతో పాట్లాడిన సీడీ సుందరి మీడియాలో వచ్చిన రాసలీలల సీడీలో ఉన్నది నేను కాదని, ఆడియో మాత్రమే తనదని, తన మాటలను వీడియోలో క్లబ్ చేసి వాటిని గ్రాఫిక్స్ లో తన ముఖం కనపడేలా చేశారని సీడీ సుందరి ఆమె సోదరుడు చిన్నీని నమ్మించే ప్రయత్నం చేసినట్లు లీక్ అయిన ఆడియోలో ఉంది.

 డీకేశీ మనుషులు వస్తారు

డీకేశీ మనుషులు వస్తారు

మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో తాను రాసలీలలు సాగించలేదని, అంత దిగజారే పని నేను చెయ్యనని, మీరు నన్ను పూర్తిగా నమ్మాలని సీడీ సుందరి ఆమె తల్లి, సోదరుడు చిన్నీని నమ్మించే ప్రయత్నం చేసింది. మాజీ మంత్రి డీకే. శివకుమార్ మనుషులు ఇక్కడికి వస్తున్నారని, వారితో మాట్లాడిన తరువాత మీకు మళ్లీ ఫోన్ చేస్తానని సీడీ సుందరి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న విషయాలు లీక్ అయిన ఆడియో టేప్ లో ఉన్నాయి.

 సీడీ సుందరి లవర్ ఆకాష్ టాపిక్

సీడీ సుందరి లవర్ ఆకాష్ టాపిక్

సీడీ సుందరి ప్రియుడు ఆకాష్ పేరు ఆడియో టేప్ లో ఉంది. ఆకాష్ తోపాటు కొందరు స్నేహితులు తనకు అండగా నిలిచారని, కుటుంబ సభ్యులు మీరే నాకు అండగా లేకపోవడం బాధగా ఉందని సీడీ సుందరి ఆమె కుటుంబ సభ్యుల దగ్గర విలపించింది. సీడీ సుందరి కుటుంబ సభ్యులతో ఆమె లవర్ ఆకాష్ కూడా మాట్లాడటం కాకపుట్టించింది.

 కాంగ్రెస్ VS బీజేపీ

కాంగ్రెస్ VS బీజేపీ

అయితే సీడీ సుందరి మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద రివర్స్ కేసు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. సీడీ సుందరి రాసలీలల వ్యవహారం ఇప్పుడు బీజేపీ-కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+