CD Scandal: కరోనా ఎఫెక్ట్, మాజీ మంత్రి డిశ్చార్జి, సార్ అక్కడే కొన్ని రోజులు, పీజీ లేడీ దెబ్బ !
బెంగళూరు/ బెళగావి: రాసలీలల సీడీ లీక్ కావడంతో అడ్డంగా బుక్కైపోయి మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జారకిహోళి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే రమేష్ జారకిహోళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చేశారు. కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా నయం కాకపోయినా రమేష్ జారకిహోళి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొంతకాలం పాటు రాసలీలల సీడీ మాజీ మంత్రి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించడంతో రాసలీలల సీడీ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఆరోజు ఇది జరిగింది
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారం కేసుకు సంబంధించి గత సోమవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకావలసి ఉంది. అయితే తనకు జ్వరం వస్తోందని, అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని రమేష్ జారకిహోళి ఆయన న్యాయవాది శ్యామ్ సుందర్ తో సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఆ రోజు మాత్రం రాలేను
అనారోగ్యంతో తాను చికిత్స చేయించుకుంటున్నానని, తనను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, అందు వలన తాను తరువాత విచారణకు మీ ముందు హాజరౌతానని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఆయన న్యాయవాది శ్యామ్ సుందర్ ద్వారా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి కొన్ని రోజుల ముందే సూచించడంతో ఆయన అనారోగ్యానికి గురికావడంతో విచారణకు బ్రేక్ పడింది.

కరోనా పాజిటివ్ తో కలకలం
ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 10. 30 గంటల సమయంలో మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తీవ్రఅస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. అదేరోజు బెళగావి జిల్లాలోని గోకాక్ తాలుకా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
Recommended Video

ఐసీయూ నుంచి డిశ్చార్జి
ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రమేష్ జారకిహోళికి వైద్యులు చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రమేష్ జారకిహోళి ఐసీయూలోనే బుధవారం వరకు చికిత్స పొందారు. రమేష్ జారకిహోళికి షుగర్, బీపీ కంట్రోల్ లోకి రావడంతో బుధవారం ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మాజీ మంత్రి రమేష్ జారకిహోళిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించడంతో రాసలీలల సీడీ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications