పాక్ పై యుద్ధంలో ఫైటర్ జెట్స్ కోల్పోయాం.. ఆ చిన్న తప్పుతో.. సంచలన విషయాలు వెల్లడించిన సీడీఎస్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై క్షిపణులతో భారత్ దాడి చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రమూకలు హతం అయినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత పాకిస్థాన్ సైతం జమ్ము కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడులను భారత్ కు చెందిన ప్రఖ్యాత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్ 400 సమర్థవంతంగా ఎదుర్కొంది. అన్ని డ్రోన్లను నేలకూల్చింది.

అయితే పాకిస్థాన్, భారత్ ల మధ్య జరిగిన ఘర్షణపై సీడీఎస్ అనిల్ చౌహాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మే 8న జరిగిన ఆపరేషన్ సిందూర్ లో కొన్ని ఫైటర్ జెట్లను భారత్ కోల్పోయిందని వెల్లడించారు. సింగపూర్ లోని బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయింది అని తెలిపారు. అయితే ధ్వంసమైన ఆ ఫైటర్ జెట్స్.. బ్రహ్మోస్ లేదా సుఖోయ్, మిగ్.. అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఫైటర్ జెట్స్ అయితే కోల్పోయిన మాట వాస్తవమేనని అన్నారు.

CDS Anil Chauhan Attributes Fighter Jet Loss in Operation Sindoor to Tactical Error

అయితే యుద్ధం అన్నాక ఫైటర్ జెట్స్ ధ్వంసం కావడం సహజమేనని.. అయితే అవి ఎందుకు ధ్వంసం అయ్యాయనేది మాత్రమే ముఖ్యం అని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాక కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా భారత్ జెట్స్ దెబ్పతిన్నాయి. తప్పును సరిదిద్దుకొని మళ్లీ రెండు రోజుల తర్వాత పాక్ పై సమర్థవంతంగా దాడి చేశాం. అని సీడీఎస్ స్పష్టం చేశారు.

మరోవైరు భారత్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్స్ కూల్చేశామని పాకిస్థాన్ చెబుతున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను సీడీఎస్ అనిల్ చౌహాన్ ఖండించారు. తాను చెప్పిన సమాచారం.. పాక్ చెబుతున్న సమాచారం ఒకటి కాదన్నారు. ఫైటర్ జెట్స్ ఎందుకు కూలిపోయాయి అన్నదే ముఖ్యమని.. ఆ తర్వాత మనం ఏం చేశామన్నదే ముఖ్యం అని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జులై 29,1999 లో అప్పటి వాజ్ పేయీ ప్రభుత్వం కార్గిల్ యుద్ధం పై రివ్యూ కమిటీని వేసిందని పేర్కొన్నారు. ఈ కమిటీ కీలక విషయాలను వెల్లడించిందని వివరించారు. ప్రధాని మోదీ సైతం రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 8 నుంచి 11 వరకు ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఈ యుద్ధంలో పాక్ కు చెందిన దాదాపు 200 డ్రోన్ లను భారత్ ధ్వంసం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+