భారత్ మోకరిల్లేలా, రక్తమోడేలా చేయాలనుకున్న పాక్- సీడీఎస్ సంచలనం
CDS Anil Chauhan: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిష్టవేసిన ఉగ్రవాదులను ఏరిపారేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ పై రెండు రోజుల పాటు కొనసాగిన యుద్ధంలో భారత ఆర్మీ కూడా నష్టపోవడం పట్ల స్పందించారు.
యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదురయ్యే నష్టాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని అనిల్ చౌహాన్ తేల్చి చెప్పారు. ఆ యుద్ధం ఫలితం ఎలాంటిదనేదే ఇక్కడ ప్రధానంగా మారుతుందని వ్యాఖ్యానించారు. పాక్ జరిపిన దాడుల్లో భారత ఆర్మీ నష్టపోయిన విషయాన్ని అంగీకరించారు.

పుణేలో డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో ఏర్పాటైన ఓ కార్యక్రమానికి అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ను ఆయన ప్రస్తావించారు. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో భారత ఆర్మీకి చెందిన కొన్ని ఎష్టాబ్లిష్మెంట్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ కు ముందుగానే సమాచారం ఇచ్చామని అనిల్ చౌహాన్ చెప్పారు. ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయని ముందుగానే చెప్పి మరీ దెబ్బకొట్టామని పేర్కొన్నారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించనున్నట్లు మే 7వ తేదీ నాడే ఆ దేశానికి తెలియజేశామని స్పష్టం చేశారు.
మే 10వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు దాడులు ఆరంభం అయ్యాయని, 48 గంటల్లో భారత్ ను మోకరిల్లేలా చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ తొలుత ఈ దాడులను చేపట్టిందని వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘించడం.. వంటి కవ్వింపు, రెచ్చగొట్టే చర్యల ద్వారా భారత్ తో యుద్ధ తీవ్రతను పెంచడానికి కారణమైందని అన్నారు.
నిజానికి భారత ఆర్మీ ఉద్దేశం మాత్రం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గల ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేయడమేనని, దాన్ని సాధించామని అన్నారు. ఉగ్రవాదుల ఏరివేత.. 48 గంటల పాటు కొనసాగుతుందని పాకిస్తాన్ భావించిందని, ఈ ఆపరేషన్ దాదాపు ఎనిమిది గంటల్లో ముగిసిపోయిందని చెప్పారు. ఆ తరువాతే రెండు దేశాల ఆర్మీ జనరల్స్ హాట్ లైన్ లో మాట్లాడారని చెప్పారు.
ఈ యుద్ధానికి ప్రధాన కారణం- పహల్గామ్ ఉగ్రవాద దాడేనని అనిల్ చౌహాన్ తేల్చి చెప్పారు. ఉగ్రవాద దాడులకు ఎలాంటి హేతుబద్ధత లేదని, దాన్ని యుద్ధంగా పరిగణించలేమని అన్నారు. భారత్ ను రక్తసిక్తం చేయాలని పాక్ నిర్ణయించిందని చెప్పారు. 1965లో జుల్ఫికర్ అలీ భుట్టో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగిస్తూ భారత్ పై 1,000సంవత్సరాల యుద్ధాన్ని ప్రకటించాడని గుర్తు చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications