లైంగిక దాడి కేసుల్లో రెండు వేళ్ల పద్ధతి ఉందా, లేదా: మాడభూషి శ్రీధరాచార్యులు
హైదరాబాద్: లైంగికదాడి నిర్ధారణ కోసం వివాదాస్పద రెండువేళ్ల పరీక్షా విధానానికి ఇంకా స్వస్తిపలికింది లేనిది స్వయంగా వెల్లడించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారో లేదో తెలుపాల్సిందిగా ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఢిల్లీ ఆరోగ్యశాఖ సమాధానం తెలుపలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సీఐసీని ఆశ్రయించిన నేపథ్యంలో సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఈ ఆదేశాలను వెలువరించారు.
రెండు వేళ్ల విధానంలో పరీక్షించడం బాధితురాలి హక్కులకు భంగం కల్గించడమేనని, దాని స్థానంలో లైంగికదాడి నిర్థారణకు మెరుగైన విధానాలు రూపొందించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకించిన శ్రీధరాచార్యులు, వైద్యులు చేయబోయే పరీక్షలు ఎలాంటివో తెల్సుకునే హక్కు బాధితులకు తప్పక ఉంటుందని, ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని విధిగా స్పష్టం చేయాల్సిందేనన్నారు.

భార్యాభర్తల మధ్యనా ఆర్టిఐ
భార్యాభర్తల మధ్య ఆదాయం, పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించి సమాచార ఆదానప్రదాన హక్కు (ఆర్టీఐ) ఉంటుందని కేంద్ర సమాచార కమిషనర్ మాఢభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. భర్త వదిలేసిన ప్రశాస్న శర్మ అనే మహిళ దాఖలు చేసిన రెండో అప్పీలు విచారణ సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. భార్యాపిల్లల పోషణ విషయాల్లో ఆర్టీఐ కల్పిస్తున్న గోప్యతను ప్రజాహితం అధిగమిస్తుందన్న ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఆధారంగా ఈ కేసును పరిష్కరించారు.
కాగా, ఉద్యోగి అయిన భర్త ఆస్తులు, తానిచ్చిన కట్నం తాలూకు వివరాలు మొత్తం కావాలని ప్రశాస్న శర్మ అభ్యర్థన దాఖలు చేశారు. అయితే, ఇది కోర్టు పరిధిలోకి వచ్చే అంశమంటూ సమాచార అధికారి చేతులు దులిపేసుకున్నారు. దీన్ని శ్రీధర్ ఆచార్యులు తప్పుబట్టారు. భార్యాభర్తల మధ్య సమాచార దాపరికానికి చోటులేదని, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications