వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి లో తుపాకీల మోత: యువకుడి బలి

|
Google Oneindia TeluguNews

ఆరా: బీహార్ లో ఓ యుకుడు పెళ్లి సందర్బంగా తుపాకీతో కాల్పులు జరపడంతో ఓ యువకుడు బలి అయ్యాడు. పలువురికి గాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని పోలీసు అధికారులు చెప్పారు. స్వయానా పెళ్లి కుమారుడి సోదరుడు కాల్పులకు పాల్పడి ఒకరి ప్రాణాలు తీశాడు.

బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా లోని చౌవా గ్రామంలో జయ్ రామ్ అనే వ్యక్తి వివాహం మంగళవారం రాత్రి జరిగింది. పెళ్లి కుమారుడు సోదరుడు వివాహ వేడుకల్లో హంగామా చేశాడు. అతను లైసెన్స్ తుపాకీని తీసుకువచ్చి చేతిలో పట్టుకుని డ్యాన్స్ వేశాడు.

Celebratory firing claims another life in Bihar

తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ లు పలువురి శరీరంలోకి దూసుకు వెళ్లాయి. ఈ తుపాకికాల్పుల్లో 18 సంవత్సరాల యువకుడు మరణించాడని జిల్లా కలెక్టర్ వీరేంద్ర ప్రసాద్ యాదవ్ చెప్పారు. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పెళ్లి జరిగితే అక్కడ తుపాకి మోతలు వినిపిస్తాయని, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కాల్పులు జరపడంతో ఇలా అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
According to reports, the children were standing in their balcony to watch the wedding procession when a bullet struck them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X