పబ్‌లో అర్దనగ్న నృత్యాలు: 16 మంది అరెస్టు

బెంగళూరు: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతులను నిర్బంధించి వారి దగ్గర అర్దనగ్ననృత్యాలు చేయిస్తున్న 16 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. పబ్ లో నిర్బంధంలో ఉన్న 26 మంది యువతులను రక్షించామని సీసీబీ పోలీసులు చెప్పారు.

బెంగళూరులోని కోరమంగల ప్రాంతంలో మారుతి ప్లాజాలో దావత్ పబ్ నిర్వహిస్తున్నారు. ఈ పబ్ లో అమ్మాయిలతో అర్దనగ్నంగా నృత్యాలు చేయిస్తున్నారని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. బుధవారం అర్దరాత్రి 12 గంటల సమయంలో పోలీసులు పబ్ దగ్గరకు చేరుకున్నారు.

 Central Crime Branch Police raid near Koramangala pub in Bangalore

తరువాత పబ్ మీద దాడి చెయ్యడంతో యువతులు అర్దనగ్నంగా నృత్యాలు చేస్తున్నారని పోలీసులు అన్నారు. కురచ దుస్తులు వేసి పబ్ లో మద్యం సేవించడానికి వెళ్లిన వారిని రెచ్చగొట్టే విదంగా వారి మీద పడి డ్యాన్స్ లు చెయ్యాలని యువతులను బలవంతం చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

అర్దనగ్నంగా డ్యాన్స్ లు చెయ్యడానికి నిరాకరించిన యువతులను అదే కట్టడంలోని ఒక గదిలో నిర్బందించి చెప్పినట్లు వినకపోతే హత్య చేస్తామని బెదిరించి లోంగదీసుకుంటున్నారని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పబ్ దగ్గర కొందరు గూండాలను పెట్టుకుని ఇతరులు లోపలికి వెళ్లకుండ జాగ్రతలు తీసుకున్నారని పోలీసులు అన్నారు. వివిద రాష్ట్రాలకు చెందిన 26 మంది యువతులను రక్షించి 16 మంది నిందితులను అరెస్టు చేసి నగదు, మొబైల్ లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పబ్ యజమాని, నిర్వహకులు పరారైనారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+