రైతులకు మోడీ సర్కారు గుడ్‌న్యూస్: ఈ 14 పంటలకు మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరలు పెంచింది. వరికి 117 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పెంపుతో క్వింటాల్‌ ధాన్యం ధర 2,300 రూపాయలకు చేరింది. వరితో పాటు పత్తి, రాగి, మొక్క జొన్న, జొన్నపంటలకు మద్దతు ధర (MSP)ని పెంచినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు.

పంట ఉత్పత్తి ధరకు పెంచిన ఎమ్మెస్పీ కనీసం 1.5శాతంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు గుజరాత్, తమిళనాడులో మొత్తం 7,453 కోట్లతో ఒక గిగావాట్‌ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వధావన్‌లో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్‌ను 76వేల కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Central government hiked minimum support price for 14 crops

రైతులకు ఇన్‌పుట్ ధర కంటే 50 శాతం ఎక్కువ ధరను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ లక్ష్యానికి అనుగుణంగా నిర్ణయాలు ఉన్నాయని మంత్రి వైష్ణవ్ అన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాల కోసం గత సంవత్సరంతో పోలిస్తే MSPలో అత్యధిక సంపూర్ణ పెరుగుదల సిఫార్సు చేశారు. వరి, రాగు, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి సహా 14 ఖరీఫ్‌ సీజన్‌ పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నేటి నిర్ణయంతో రైతులకు సుమారుగా రూ.లక్ష కోట్లు ఎంఎస్‌పిగా లభించనున్నాయి. గత సీజన్ కంటే ఇది రూ.35,000 కోట్లు ఎక్కువ.

పెరిగిన పంటల మద్దతు ధరలు:

వరి (సాధారణ రకం)- రూ.2300
వరి (గ్రేడ్‌-ఎ)- రూ.2320
జొన్న (హైబ్రిడ్‌)- రూ.3371
జొన్న (మాల్దండి)- 3421
సజ్జలు- రూ.2625
రాగులు- రూ.4290
మొక్కజొన్న- రూ.2225
వేరుశెనగ- రూ.6783
పొద్దుతిరుగడు విత్తనాలు- రూ.7280
నువ్వులు- రూ.9267
సోయాబీన్‌ (పసుపు)- రూ. 4892
పెసలు- రూ.8682
పత్తి (మధ్యరకం)- రూ.7121
పత్తి (లాంగ్ స్టెపెల్‌)- రూ.7521
కందులు- రూ.7550
మినుములు- రూ.7400

కాగా, నూనెగింజలు, పప్పుధాన్యాలకు అత్యధికంగా ఎంఎస్‌పి పెరిగింది. అవి నైజర్‌సీడ్ (క్వింటాల్‌కు రూ. 983 పెరిగింది), ఆ తర్వాత నువ్వులు (క్వింటాల్‌కు రూ. 632 పెరిగింది), అర్హార్ పప్పు (క్వింటాల్‌కు రూ. 550 పెరిగింది).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+