2 ఏళ్ళలో 2.53 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: పోలీసుశాఖలోనే ఎక్కువ
న్యూఢిల్లీ: గత రెండేళ్ళలో 2.53 లక్షల కేంద్ర ప్రబుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని 2018-19 వార్షిక బడ్జెట్ నివేదిక ప్రకారం తెలుస్తోంది.ఈ రెండేళ్ళలో అత్యధికంగా పోలీస్ శాఖలో ఎక్కువగా ఉద్యోగస్తులను భర్తీ చేసినట్టు ఆ నివేదిక తెలిపింది.
2018 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 35.05 లక్షలకు పెరిగనుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో 2.53 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని 2018-19 వార్షిక బడ్జెట్ వెల్లడించింది.

2016, 2017లో పోలీస్ శాఖలోనే అత్యధిక నియామకాలు జరిగినా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కూడా ఉద్యోగుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుంది.
వ్యవసాయ, సహకార, కుటుంబ సంక్షేమ శాఖలో మార్చి 1 నాటికి ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే 1944 ఉద్యోగాలు అదనంగా వస్తాయని ని బడ్జెట్ పత్రాలు పేర్కొన్నాయి.
2016లో ఈ విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3996గా నమోదైంది. అదేవిధంగా 2016, 2018 మధ్య పశుసంవర్థక, డైరీ అండ్ ఫిషరీస్ శాఖలో 1519 ఉద్యోగాలు నూతనంగా అందుబాటులోకి వచ్చినట్టు అంచనా. అణుఇంధన శాఖలోనూ గత రెండేళ్లలో కొత్తగా 6279 ఉగ్యోగాలు అదనంగా సమకూరాయి.
ఇక 2018 నాటికి పౌరవిమానయాన శాఖలో 1197 ఉద్యోగాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక హోంమంత్రిత్వ శాఖ పరిధిలో గత రెండేళ్లలో అత్యధికంగా పోలీస్ శాఖలో లక్షకు పైగా పోలీసు పోస్టులు భర్తీ అయ్యాయి.
మార్చి 1, 2016లో పోలీస్ శాఖలో 10 లక్షల 24వేల 374 మంది ఉద్యోగులుండగా, మార్చి 1, 2018 నాటికి వీరి సంఖ్య 11 లక్షల 25వేల093కు పెరగనుంది. ఇక విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, మైనారిటీ వ్యవహారాలు, గనుల మంత్రిత్వ శాఖలోనూ అదనపు పోస్టులు అందుబాటులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications