కేంద్ర ప్రభుత్వం ఆఫర్: అకౌంట్ లోకి రూ.6వేలు

ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం.. దీనికోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేకమైన 112 నెంబరును విడుదల చేసింది.

ఒక కాంటెస్ట్ లో పాల్గొని విజేతగా నిలిస్తే రూ.6వేలు గెలుచుకునే అవకాశాన్ని కంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. లోగో డిజైన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రీల్ చేయాలి.. జింగిల్ కంపోజ్ చేసినా చాలు. దీని వివరాలేంటి? చివరి తేదీ ఎప్పుడు? ఎలాంటి షరతులున్నాయి.. తదితర వివరాలు తెలుసుకుందాం.

కేంద్రంలోఅధికారంలో ఉన్న నరేంద్రమోడీ సర్కార్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసులను మరింత మెరుగుపరచబోతోంది. మహిళల భద్రత కోసం కొత్త ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం.. దీనికోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేకమైన నెంబరును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 112 నెంబరుకు కాల్ చేయవచ్చు. పోలీసుల నుంచి అగ్నిప్రమాదం నివారణ, అంబులెన్స్.. ఇలా పలురకాల సర్వీసులను ఈ నెంబరుద్వారా పొందవచ్చు. కేంద్ర హోంశాఖ తాజాగా మైగౌవ్ తో కలిసి ఒక కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. రీల్స్ లేదంటే షార్ట్ వీడియో చేయడం, లోగో డిజైన్ , జంగీల్ కంపోజ్ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Central Government Offer: Rs.6000 into the account

ఈ కాంటెస్ట్ లో పాల్గొని విజేతగా నిలిస్తే రూ.6వేల ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. మీరు ఎంచుకునే క్యాటగిరీని బట్టి ప్రైజ్ మనీ కూడా మారుతుంటుంది. రీల్ చేయాలని భావిస్తే విజేతకు రూ.3వేలు దక్కుతాయి. రెండో విన్నర్ కు రూ.2వేలు, మూడో విన్నర్ కు రూ.వెయ్యి వస్తాయి. ఏప్రిల్ 8వ తేదీ దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ. రీల్ 45 సెకన్లకన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే సైజ్ 2 ఎంబీకన్నా ఎక్కువ ఉండకూడదు.

లోగోడిజైన్ చేయాలని భావిస్తే విజేతకు రూ.3వేలు, మొదటి 5 స్థానాల్లో నిలిచినవారికి డబ్బులు వస్తాయి. పోస్టర్ ను పీడీఎఫ్ ఫార్మాట్ లో లేదంటే జీపీఈ ఫార్మాట్ లో డిజైన్ చేసి పంపించాలి. ఫైల్ సైజు 2 ఎంబీలోపుండాలి. జింగిల్ కంపోజ్ చేయాలని భావిస్తే.. మొదటి విజేతకు రూ. 6 వేలు లభిస్తాయి. రెండోస్థానంలో నిలిచినవారికి రూ. 4 వేలు, ఇక మూడో విజేతకు రూ. 3 వేలు వస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందించాలి. జింగిల్ 45 సెకన్లు ఉండాలి. గూగుల్ డ్రైవ్‌లో హై క్వాలిటీతో దీన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+