జాతీయ సెక్స్ నేరగాళ్ల జాబితా ఇస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: జాతీయ సెక్స్ నేరగాళ్ల జాబితాను సిద్దం చేస్తున్నామని, త్వరలో మీ ముందు సమర్పిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. మహిళలపై వివిద రకాల లైంగిక నేరాలకు పాల్పడి చార్జ్ షీట్, విచారణ ఎదుర్కొంటున్న నిందితుల పూర్తి వివరాలు బయటపెడుతున్నామని సుప్రీం కోర్టులో చెప్పింది.
ఈ విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టులో ఓ నివేదిక సమర్పించింది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)లో భాగంగా లైంగిక దాడుల నేరగాళ్ల రిజిస్ట్రీని ప్రతిపాదించనున్నామని సుప్రీం కోర్టులో చెప్పింది.
మహిళలపై అత్యాచారాలు, విడిపోయిన తరువాత భార్యపై భర్త లైంగిక దాడికి పాల్పడటం, ఉన్నత స్థాయి అధికారులు దిగువ స్థాయి ఉద్యోగినిలపై లైంగిక దాడులకు పాల్పడటం వంటి కేసుల్లో చార్జ్ షీట్ ఎదుర్కొంటున్న నేరగాళ్ల వివరాలు పొందుపరుస్తాం అని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

ఈ పూర్తి వివరాలను సుప్రీంలో అఫిడవిట్ సమర్పించింది. ఓ మహిళపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి ఎమ్మెమ్మెస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్నది.
మహిళలపై సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలు తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపద్యంలోనే సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.












Click it and Unblock the Notifications