ఆసియానెట్, మీడియా వన్ చానెల్‌పై 48 గంటల నిషేధం
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఘర్షణలో తప్పుడు రిపోర్ట్ చేసిన రెండు మళయాళ చానెల్లు ఆసియానెట్, మీడియా వన్‌కు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ నోటీసులు జారీచేసింది. గతనెల 25వ తేదీన ఆసియానెట్, మీడియా వన్ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, అందుకే నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. మీడియా వన్ చానెల్ సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 12.30 గంటల వరకు తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని పేర్కొన్నది. అంతేకాదు మీడియా వన్ ఢిల్లీ కరస్పాండెంట్ హసనుల్ బన్నా రిపోర్ట్ చేసిన అంశాలను వివరించారు. పోలీసులు కూడా చేష్టలుడిగి చూశారని.. సీఏఏ అనుకూల వర్గానికి సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.

Recommended Video

ముస్లింలు ఎక్కువగా ఉండే చాంద్‌బాగ్‌లో నిరసనకారులు షాపులను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పుపెట్టారని రిపోర్ట్ చేసింది. అంతేకాదు రాళ్లు విసిరారని.. చెలరేగిన ఘర్షణలో చాలామందిని ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. సమాచార ప్రసారాల చట్టం ప్రకారం ఆసియానెట్, మీడియా వన్ సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిపింది. మరోవైపు ఆసియానెట్ చానెల్ ఢిల్లీ ఘర్షణలో మృతుల సంఖ్యను పెంచుతూ వెళ్లిందని పేర్కొన్నది. కేంద్ర సమాచార శాఖ ఆదేశాలతో కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మీడియావన్, ఆసియానెట్ చానెళ్లపై 48 గంటలపాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు మీడియా వన్ ఎండీ, ఆసియానెట్ ఎండీకి.. సమాచార ప్రసార శాఖ నోటీసులు జారీచేయగా.. దానిని కేరళ ప్రభుత్వం 48 గంటలపాటు బ్యాన్ చేస్తున్నట్టు పేర్కొన్నది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications