తెర్చుకోలేదు: పోర్న్ సైట్లకు అడ్డుకట్ట, మిశ్రమస్పందన
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్ల పైన కేంద్రం కొరడా ఝుళిపించింది. అయితే, నేరుగా ఆయా వెబ్ సైట్ల పైన నిషేధం విధించకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వాటిని బ్లాక్ చేసింది. ఆదివారం తెల్లవారుజామునుంచే ఉచిత, పెయిడ్ అన్నీ కలిపి దాదాపు 4800కు పైగా పోర్న్ వెబ్ సైట్లు బ్లాక్ అయ్యాయి.
ఈ పరిణామం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది అశ్లీల వెబ్ సైట్లు, చిత్రాలను అరికట్టడంలో ఇది తొలి చర్యగా కేంద్రం భావిస్తోంది. అశ్లీల వెబ్ సైట్లను నిషేధించే విషయంలో సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం ఆచితూచి స్పందించింది.
18 ఏళ్లకు పైబడిన పెద్దవారు తమ ఇంట్లో లేదా నాలుగు గోడల మధ్య అశ్లీల సైట్లను చూడటం నేరం కాదని, అశ్లీల సైట్లను చూడవద్దనడం అనేది వ్యక్తి గత స్వేచ్ఛను ఉల్లంఘించినట్లవుతుందని స్పష్టం చేసింది.

అయితే, కేంద్రం అనధికారికంగా వాటిని బ్యాన్ చేసింది. అశ్లీల సైట్లను నిషేధించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు హల్ చల్ చేశాయి.
ఎంటీఎస్ఎల్, బిఎస్ఎన్ఎల్, యాక్ట్ (బీమ్), హాత్ వే తదితర బ్రాండ్ బ్యాండ్ సేవల్ని వినియోగిస్తున్న కొందరు శనివారం అర్ధరాత్రి నుంచి పోర్న్ సైట్లు తెరుచుకోవడం లేదంటూ సోషల్ సైట్లలో పోస్ట్ చేశారు. నీలి వెబ్ సైట్ల బ్యాన్ పైన వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.












Click it and Unblock the Notifications