రూ.63,000 కోట్ల మెగా డీల్‌కు కేంద్రం క్లియరెన్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఓ బిగ్గెస్ట్ డీల్‌కు ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఈ మెగా డీల్ విలువ ఏకంగా 63,000 కోట్ల రూపాయలు. దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒప్పందం ఇది.
నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయడానికి 26 రాఫెల్ మెరైన్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. దీనికోసం 63 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఫ్రాన్స్ వీటిని తయారు చేయనుంది. రాఫెల్ యుద్ధ విమానాల్లో నౌకాదళ వేరియంట్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వ్యయం చేస్తోండటం ఇదే తొలిసారి.

గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇది. 22 సింగిల్-సీటర్ నాలుగు ట్విన్-సీటర్ జెట్ ఫైటర్లతో పాటు ఫ్లీట్ మేనేజ్‌మెంట్, లాజిస్టికల్ సపోర్ట్, వీటిని నడిపించడంలో నౌకాదళాధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఇతర ఆఫ్-సెట్ బాధ్యతలకు సంబంధించిన ఓ సమగ్ర ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ఒప్పందంపై కుదిరిన తేదీ నుంచి దాదాపు నాలుగు నుంచి అయిదు సంవత్సరాల వ్యవధిలో భారత్‌కు రాఫెల్ మెరైన్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సరఫరా చేస్తుంది ఫ్రాన్స్. 2029 చివర లేదా 2030 తొలి మూడు నెలల వ్యవధిలో మొదటి విడతను రాఫెల్ మెరైన్ క్రాఫ్ట్స్ భారత్‌కు అందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం కూడా 2031 నాటికి పూర్తవుతుంది.
ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు- దేశ విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి తమ కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉంది. పాత తరానికి చెందిన మిగ్-29 కే ఎయిర్ క్రాఫ్ట్స్ స్థానంలో ఈ రాఫెల్స్ తన సేవలను నౌకాదళానికి అందిస్తాయి.
రాఫెల్ మెరైన్స్‌ను విమాన వాహక నౌకల ఆధారిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసింది ఫ్రాన్స్. షార్ట్ టేకాఫ్ దీని ప్రత్యేకత. తక్కువ స్థలంలో కూడా టేకాఫ్ తీసుకోగలుగుతుంది. క్షణాల వ్యవధిలో దూసుకెళ్లగలుగుతుంది. బలమైన ల్యాండింగ్ గేర్, అరెస్టర్ హుక్స్ కలిగివుండటం వీటి ప్రత్యేకగా చెప్పుకోవచ్చు.
ఏ జెట్ ఫైటర్‌లోనూ లేని యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కానెడ్ అర్రే రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ ఇందులో ఉంటుంది. గంటకు 1.8 మాక్ స్పీడ్ అంటే 2,222 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గాలిలోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం దీని సొంతం. పూర్తిస్థాయిలో ఇవి నౌకాదళంలో చేరతే- సముద్ర జలాలపై భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications