పాకిస్థాన్ యువతిని సీక్రెట్ గా పెళ్లాడిన భారత జవాన్.. బిగ్ షాకిచ్చిన కేంద్రం

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందిన నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని సిద్ధమైంది. ఇప్పటికే సింధూ నది జలాల ఒప్పందం రద్దు, వీసాల రద్దు, ఎగుమతులు, దిగుమతులు రద్దు, పంజాబ్ సరిహద్దులోని అటారీ- వాఘా బోర్డర్ మూసివేత నిర్ణయాలతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది.

అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఉన్న పాకిస్థాన్ ప్రజలు ఏప్రిల్ 27 లోపు భారత్ ను వీడి పాకిస్థాన్ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనేక మంది పాక్ పౌరులు తమ బంధువులు, పిల్లలు, ఫ్రెండ్స్ ను వదిలి స్వదేశానికి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో భారత సైన్యంలో పనిచేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఓ పాకిస్థాన్ యువతిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నందుకు గాను అతడ్ని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్ లోని గరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్.. 2017 ఏప్రిల్ లో సీఆర్పీఎఫ్ లో జాయిన్ అయ్యారు. అయితే ఆయన ఓ పాకిస్థాన్ యువతిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్న కారణంగా తాజాగా ఆయనపై కేంద్రం వేటు వేసింది. అతడ్ని విధుల నుంచి తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అయితే మునీర్ మాత్రం.. భారత ప్రభుత్వం అనుమతితోనే తాను పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను పాక్ యువతిని పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు అధికారులకు చెప్పానని.. అయితే వాళ్లు పాస్ పోర్టులు, ఇతర గుర్తింపు కార్డులు సమర్పించాక ఓకే చెప్పారని వివరించారు. ఇది సీక్రెట్ మ్యారేజ్ కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తాను కోర్టులో పిటిషన్ వేస్తానని.. న్యాయం తమవైపే ఉందని అన్నారు.

మునీర్ అహ్మద్ గతేడాది మే 24న వీడియో కాల్ ద్వారా ఆన్ లైన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వివాహ చిత్రాలను అధికారులకు సమర్పించారు. అయితే ఆమె తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరి 28న 15 రోజుల వీసా కింద భారత్ వచ్చింది. అప్పుడు లాంగ్ టర్మ్ వీసా కోసం అప్లై చేసారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడి జరగడంతో పరిస్థితులు మారిపోయాయి. అయితే తాజాగా కోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఆమె జమ్ములోని మునీర్ ఇంట్లోనే ఉంటోంది.

Centre Dismisses CRPF Jawan for Concealing Marriage to Pakistani National

అయితే తాజాగా తనను విధుల నుంచి తీసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని మునీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు తొలగిస్తున్నట్లు ఉన్న లేఖను పంపించారని అన్నారు. ఈ విషయంపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని.. న్యాయం తమవైపే ఉందని మునీర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+