ఆ ఇస్లామిక్ మత ప్రబోధకుడిపై కేంద్రం కొరడా: అయిదేళ్ల బ్యాన్ పొడిగింపు

వివాదాస్పద ఇస్లామిక్ ప్రబోధకుడు డాక్టర్ జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాన్ని మరో అయిదేళ్ల పాటు పొడిగించింది. దేశద్రోహ కార్యకలాపాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది. ఈ ఫౌండేషన్ ను యూఏపీఏ పరిధిలోకి తెచ్చింది. సంఘ విద్రోహ సంస్థ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దేశ అంతర్గత భద్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఐఆర్‌ఎఫ్ కార్యకలాపాలు సాగుతున్నాయని కేంద్ర హోమ్ శాఖ పేర్కొంది. జకీర్ నాయక్ తన విద్వేషపూరిత ఉపన్యాసాల ద్వారా వేర్వేరు మత సమూహాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షితులను చేయడానికి ఆయన ప్రయత్నిస్తోన్నారని, దీనివల్ల శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని పేర్కొన్నాయి. దీని ఆధారంగా హోం శాఖ నిషేధాన్ని పొడిగించింది.

Centre extended the ban on preacher Zakir Naik Islamic Research Foundation for another five years

కేంద్ర ప్రభుత్వం మొదటగా 2016 నవంబరు 17న ఐఆర్‌ఎఫ్ పై అయిదేళ్ల కాలానికి నిషేధం విధించింది. ఇది ముగిసిన తర్వాత 2021 నవంబర్ లో దీన్ని మరో అయిదేళ్లపాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ గడువు కూడా ముగియడంతో తాజాగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. భద్రత, శాంతియుత పరిస్థితులను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీంతో మూడోసారి జకీర్ నాయక్ ఫౌండేషన్ పై నిషేధం వేటు పడినట్టయింది.

అదరగొట్టిన న్యూజిలాండ్: సెంచరీ బాదిన స్టార్ బ్యాటర్- టీమిండియాకు భారీ టార్గెట్
అదరగొట్టిన న్యూజిలాండ్: సెంచరీ బాదిన స్టార్ బ్యాటర్- టీమిండియాకు భారీ టార్గెట్

2016 జూలైలో బంగ్లాదేశ్ ఢాకాలో ఓ కేఫ్‌పై జరిగిన భీకర ఉగ్రవాద దాడి తర్వాత జకీర్ నాయక్ పేరు అంతర్జాతీయంగా చర్చనీయాంశంలోకి వచ్చింది. జకీర్ నాయక్ ఇచ్చిన ప్రసంగాల ద్వారానే తాము ప్రభావితం అయ్యామని, ఈ దాడికి దిగామని అప్పట్లో దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ అతనిపై పలు కేసులు నమోదు చేసింది. మనీ లాండరింగ్, చట్టవిరుద్ధ నిధుల సమీకరణతో పాటు విద్వేష ప్రసంగాల కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో తనపై చట్టపరమైన చర్యలు కఠినతరం అవుతోండటంతో జకీర్ నాయక్.. దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం అతను మలేషియాలో నివాసం ఉంటోన్నాడు. అతన్ని తమకు అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వం మలేషియాపై ఒత్తిడి తెస్తోంది గానీ అది సాధ్యపడట్లేదు. జకీర్ నాయక్ ను అప్పగించడానికి నిరాకరించింది. ఆ తర్వాత కేంద్రం ఐఆర్‌ఎఫ్ పైనే కాకుండా, దాని అనుబంధ సంస్థలపైనా నిఘా పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+