Lockdown 3.0: మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 4వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తున్నట్లు కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 17వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్నిటికి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఇప్పటికే ప్రత్యేక రైళ్లను కేంద్రం నడుపుతోంది. ప్రధాని పలువురు మంత్రులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Recommended Video
ఇక లాక్‌డౌన్ సమయంలో కొన్నిటికి మినహాయింపును ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. గ్రీన్, మరియు ఆరెంజ్ జోన్లలో ఆంక్షల సడలింపు ఉంటుందని వెల్లడించింది. ఇక రెడ్ జోన్లు, కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు యథాతథంగానే ఉంటాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఏ జోన్లు అయినా సరే కొన్నిటిపై మాత్రం నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు మెట్రో రైళ్లు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణాలు, స్కూళ్లు కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై ఆంక్షలుకొనసాగుతాయని వెల్లడించింది.

ఇక రెడ్ జోన్లు కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆటోలు, రిక్షాలు తిరగడంపై నిషేధం విధించింది. ట్యాక్సీలు, క్యాబ్‌లపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. ఇక మంగలిషాపులు, స్పాలు సెలూన్లు ఎప్పటిలాగే మూసి ఉంచాలని వాటిని తెరిచేందుకు అనుమతించడం లేదని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ల కిందకు వచ్చే జిల్లాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని రెడ్ జోన్లలో కేంద్రం కొన్నిటికి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. పట్టణప్రాంతాల్లో కూడా నిత్యావసర వస్తువుల తయారీ కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. గ్రామీణప్రాంతాల్లోని రెడ్ జోన్లలో నిర్మణరంగంకు సంబంధించిన పనులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇటుకల తయారీలకు అనుమతిస్తూ కేంద్రం ఇక ఏప్రిల్ 30న ఏవైతే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందో అవే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రెడ్ జోన్లలో కొన్నిటికి మినహాయింపులు ఇవ్వగా వాటితో పాటు అదనంగా మరికొన్నిటికి గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మినహాయింపులు ఇస్తూ అనుమతి ఇచ్చింది.












Click it and Unblock the Notifications