లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన: మోడీ సర్కారు ప్రణాళిక సిద్ధం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ అంశమే జనగణన(Population Census). సార్వత్రిక ఎన్నికల (LS polls) ప్రక్రియ ముగిసిన తర్వాత దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ మీడియా కథనం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త జనాభా గణనను పరిశీలిస్తోందని, దాని ఆర్థిక డేటా నాణ్యతను మెరుగుపరిచే మార్గాలను చర్చిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వర్గాలు తెలిపాయి. జనగణన కోసం దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ సర్వే దాదాపు 12 నెలలపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

కాగా, దేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరిది 2021లో జరగాల్సి ఉంది. అయితే, కరోనావైరస్ (COVID-19) మహమ్మారి, ఇతర కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. దేశంలో 1881లో తొలి జనగణనను నిర్వహించారు. అప్పట్నుంచి ప్రతీ దశాబ్దం ప్రారంభంలో ఇది కొనసాగుతూ వచ్చింది. జనగణన చట్టం ప్రకారం చేపట్టే ఈ ప్రక్రియ వల్ల పదేళ్లలో దేశ జనాభా ఎంతమేర పెరిగిందో తెలుస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఇదే ఆధారంగా నిలుస్తుంది. కాగా, గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం చర్చించిన దాని ఆర్థిక డేటా నాణ్యతను మెరుగుపరచడానికి గణాంకాల మంత్రిత్వ శాఖ కొన్ని ప్రతిపాదనలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ప్రతిపాదనలలో "చివరిసారిగా 2014లో విడుదలైన వ్యాపారాల సర్వేను పునరుద్ధరించడం, గృహ వినియోగ సర్వేను వార్షిక ప్రాతిపదికన ప్రచురించడం" కూడా ఉన్నాయి అని ఆ వర్గాలు తెలిపాయి. "ఇది కీలక సూచికల కోసం ఏకరీతి బేస్ ఇయర్‌ను ప్రవేశపెట్టాలని, ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి వస్తువుల బాస్కెట్‌ను నవీకరించాలని కూడా యోచిస్తోంది అని పేర్కొన్నాయి. తదుపరి సమాచారం కోసం చేసిన అభ్యర్థనలకు భారతదేశ గణాంకాల మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించలేదని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.












Click it and Unblock the Notifications