Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టోల్ జంఝాటం నుంచి విముక్తి: ఏడాది పాస్- ధర ఇదే

Toll Gate: ఫాస్టాగ్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగడానికి సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడంలో భాగంగా అత్యాధునిక పద్ధతుల్లో టోల్ ఫీజులను వసూలు చేయబోతోంది.

ప్రస్తుతం జాతీయ రహదారులపై నెలకొల్పిన ప్లాజాల వాహనాల నుంచి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొంతసేపయినా వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది.

Centre introducing a FASTag-based Rs 3000 Annual Pass effective from August 15

కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తుతోండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి నిల్చున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగట్లేదనే అభిప్రాయానికి వచ్చింది కేంద్రం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని- మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. కొత్తగా టోల్ పాసులను ప్రవేశపెట్టింది. వార్షిక టోల్ పాస్ ధర- 3,000 రూపాయలు. దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు 200 ట్రిప్పులు రాకపోకలు సాగించే వీలు వాహనదారులకు ఉంటుంది. ఈ సౌకర్యం నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తించదు

ఆగస్టు 15వ తేదీన స్వాత్రంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ ను అమలులోకి తీసుకుని రానున్నట్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వార్షిక పాస్ కొన్న తేదీ నుంచి ఏడాది పాటు అంటే పాస్ కొన్న తేదీ వరకు లేదా.. 200 ట్రిప్పులు.. వీటిలో ఏది ముందుగా వస్తే అది- చెల్లుబాటు అవుతుంది.

పాస్ ఉంది కదా అని టోల్ గేట్ల గుండా ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించే వీలు లేదు. 200 ట్రిప్పులు మాత్రమే తిరగవచ్చు. ఎక్కడే గానీ అదనంగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్‌ ప్రొవైడర్‌ అకౌంట్‌ లేదా వాలెట్‌లో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఉంచుకోనక్కర్లేదు.

దీనితో పాటు లైఫ్ టైమ్ టోల్ పాస్ పైనా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లైఫ్ టైమ్ టోల్ పాస్ ధర- 30,000 రూపాయలుగా ఉండొచ్చు. ఈ పాస్ ను యాక్టివేట్ చేయడానికి, రెన్యూవల్ చేయించుకోవడానికి అవసరమైన ప్రత్యేక లింక్ త్వరలో రాజ్‌మార్గ యాత్ర యాప్‌, NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+