అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై కేంద్రం కొరడా- కీలక ఆదేశాలు జారీ
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న అయిదు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కీలక ఆదేశాలను జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం ఉల్లంఘించిన కారణంగా నోటీసులను పంపించింది. ఈ మేరకు వినియోగదారులు ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది.
నోటీసులను జారీ చేయడానికి గల కారణాలను వెల్లడించింది. కారు సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లను విక్రయించడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ క్లిప్స్ అన్నింటినీ తక్షణమే ఆయా సంస్థల వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని వాటి యజమానులను సూచించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అలాంటి వస్తువులను ఆన్‌లైన్ విక్రయించడం సరికాదని స్పష్టం చేసింది. ఇది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా భావించినట్లు తెలిపింది.

ఈ మేరకు ఇ-కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, మీషోలకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. అమెజాన్-8,095, ఫ్లిప్‌కార్ట్-4,000 నుంచి 5,000, మీషో-21, స్నాప్‌డీల్-1, షాప్ క్లూస్-1 అలారం స్టాపర్ క్లిప్‌ను విక్రయిస్తోన్నాయి. వాటిని వెంటనే తొలగించాలంటూ కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమిషనర్ నిధి ఖరే ఉత్తర్వులు ఇచ్చారు.
సీట్ బెల్ట్ ధరించనప్పుడు అలారం బీప్ చేసే సౌకర్యం దాదాపుగా అన్ని కార్లల్లో ఉంది. ఈ అలారం బీప్ శబ్దం రాకుండా కొన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్లు ప్రత్యేకంగా కొన్ని క్లిప్స్‌ను విక్రయిస్తోన్నాయి. వాహనదారులు వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోన్నారు. సీట్ బెల్ట్ ధరించనప్పుడు వచ్చే బీప్ శబ్దాన్ని నిలువరించేలా ఈ స్టాపర్ క్లిప్స్ విక్రయించకూడదని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దీన్ని వినియోగించడం వల్ల డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించకుండానే తమ ప్రయాణాలను సాగించే అవకాశం ఉందని, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మరణాల సంఖ్యను పెంచడానికి ఇది పరోక్షంగా దోహదం చేస్తోందని కేంద్రం భావించింది. సీట్ బెల్ట్ ధరించనప్పుడు బీప్ శబ్దం రావడం వల్ల డ్రైవర్లు అప్రమత్తమౌతారని అభిప్రాయపడింది.
ఈ కారణంతోనే అదేపనిగా రూపొందించిన ఈ వ్యవస్థను నిలుపుదల చేసేలా అలారం స్టాపర్ క్లిప్‌ను విక్రయించడం నేరమని తెలిపింది. సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 138 ప్రకారం- కేంద్ర ప్రభుత్వం సీట్ బెల్ట్‌ను ధరించడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. వాహనాలను నడిపే సమయంలో సీట్ బెల్ట్‌ను ధరించని డ్రైవర్లపై పెద్ద ఎత్తున జరిమానాను విధిస్తోంది కేంద్రం.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications