• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశ సరిహద్దులను తలపిస్తున్న ఢిల్లీ బోర్డర్స్, ఆప్షన్ లేదన్న కేంద్రం.. జంతువుల పట్ల కూడా ఇలా వ్యవహరించరు!

|

ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ,టిక్రీ,ఘాజీపూర్ పాయింట్స్ ఇప్పుడు దేశ సరిహద్దులను తలపిస్తున్నాయి. నిరసన ప్రదేశాలకు పోటెత్తుతున్న రైతులను అడ్డుకునేందుకు కేంద్రం సామ,దాన,బేధ దండోపాయాలను ప్రయోగిస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి అక్కడి రోడ్లపై ఏకంగా ఇనుప చువ్వలతో పాటు కాంక్రీట్ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసింది. అటు రైతులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారినప్పటి నుంచి కేంద్రం వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రిపబ్లిక్ డే రోజు పోలీస్ యాక్షన్‌కు సంబంధించి తాజాగా పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది.

పోలీసులకు మరో ఆప్షన్ లేకనే.. : కేంద్రం

పోలీసులకు మరో ఆప్షన్ లేకనే.. : కేంద్రం

రిపబ్లిక్ డే రోజు రైతులపై లాఠీచార్జి,టియర్ గ్యాస్ ప్రయోగంపై పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. ఆరోజు రైతుల చర్యలకు పోలీసుల వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందులో పేర్కొంది. అల్లర్లకు పాల్పడటంతో పాటు వారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పేర్కొంది. తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి,టియర్ గ్యాస్,వాటర్ క్యాన్లను ప్రయోగించాల్సి వచ్చిందని తెలిపింది. ట్రాక్టర్ ర్యాలీ రోజు కోవిడ్ 19 నిబంధనలను రైతులు పట్టించుకోలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో 39 మంది రైతులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.

వందలాది పోలీసులు గాయపడ్డారు : కేంద్రం

వందలాది పోలీసులు గాయపడ్డారు : కేంద్రం

ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు బారికేడ్లను తొలగించి మరీ ఢిల్లీలోకి ప్రవేశించారని కేంద్రం పేర్కొంది. రైతుల చర్యలతో ఢిల్లీ వీధుల్లో హింస చెలరేగిందని... కొంతమంది రైతులు నిర్దేశించిన మార్గాల్లో కాకుండా సెంట్రల్ ఢిల్లీ వైపు ర్యాలీని మళ్లించారని ఆరోపించింది. ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి,టియర్ గ్యాస్ ప్రయోగించడం తప్పలేదని తెలిపింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో వందలాది మంది పోలీసులు గాయపడ్డారని... ఒక రైతు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చింది.

మీడియా కూడా వెళ్లడం కష్టమే...

మీడియా కూడా వెళ్లడం కష్టమే...

ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనల తర్వాత ఢిల్లీ సరిహద్దుల్లో నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఓసారి బలవంతంగా వారిని ఖాళీ చేయించేందుకు విఫలయత్నం చేసింది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసుల బలగాలను మోహరించింది. అంచెలంచెలుగా బారికేడ్లను,ఇనుప చువ్వలు,ముళ్ల కంచెలు,కాంక్రీట్ గోడలను రహదారులపై అడ్డుగా ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కనీసం మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం కూడా ఇప్పుడు కష్టమే.

  PM Modi On Budget 2021 | Village , Farmer At The Heart Of This Budget
  జంతువుల పట్ల కూడా ఇలా వ్యవహరించరు : రైతులు

  జంతువుల పట్ల కూడా ఇలా వ్యవహరించరు : రైతులు

  మరోవైపు రైతులు కేంద్ర వైఖరిపై మండిపడుతున్నారు. 'అంచెలంచెల బారికేడ్లు,ఇనుప చువ్వలు,ముళ్ల కంచెలు... వీటి అర్థమేమిటి... మనుషుల సంగతి పక్కనపెట్టండి.. కనీసం జంతువుల పట్ల కూడా ఇలా ఎవరూ వ్యవహరించరు.' అని బీకేయూ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సింఘూ బోర్డర్ వద్ద ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో ఏ క్షణం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన నెలకొంది.

  English summary
  The Union home ministry on Tuesday justified the action of the Delhi Police against protesting farmers during the Republic Day tractor rally in the national capital. The ministry said police were left with no other option.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X