విమాన ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్

విమానయాన రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన సంస్థలకు కేంద్రప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. కనీసం 60 శాతం విమాన సీట్లను ఉచితంగా కేటాయించాలని సూచించింది. ఈ నిర్ణయం- విమాన ప్రయాణికులకు ఉపశమనం కలిగించినట్టే. అదనపు ఛార్జీల భారం ప్రయాణికులపై ఉండదు. తాజా ఆదేశాలతో సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీలో మాత్రం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

కేంద్రం తీసుకున్న తాజా చర్యల వెనుక సీట్ల ఎంపిక ఛార్జీల కట్టడి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. బుకింగ్ లేదా వెబ్‌ చెక్-ఇన్ సమయాలలో సీట్ల కోసం వసూలు చేసే అధిక ధర విధానానికి ఇది తెరదించుతుంది. 60 శాతం సీట్లను ఉచితంగా ఉంచడం ద్వారా అందరికీ సమాన ప్రాధాన్యతను కల్పించినట్టవుతుంది. ప్రయాణికుల అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించినట్టవుతుంది. దీంతో పాటు పలు మార్పులు చేసింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.

Centre Mandates 60 Percent of Flight Seats Free to Boost Passenger-Friendly Travel Cut Extra Charges

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాల మేరకు ఒకే పీఎన్‌ఆర్ కింద బుక్ చేసుకున్న ప్రయాణికులను పక్కపక్క సీట్లలో కూర్చోబెట్టాలి. ఇది కుటుంబ సభ్యులు, గుంపుగా ప్రయాణాలు సాగించే వారికి అనుకూలం. వారికి మరింత సౌకర్యాన్ని కల్పించినట్టవుతుంది. పెంపుడు జంతువులు, క్రీడా/సంగీత పరికరాల రవాణాకు భద్రతా నిబంధనల మేరకు స్పష్టమైన, పారదర్శక విధానాలను ఎయిర్‌లైన్‌లు అనుసరించాలి.

క్రికెట్, టెన్నిస్ వంటి కిట్స్, ఇతర క్రీడా సామాగ్రి, సంగీత వాయిద్య పరికరాలను పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలమైన పద్ధతిలో రవాణా చేసే సౌలభ్యాన్ని ఎయిర్‌లైన్స్‌ను కల్పించాలి. విమాన ఆలస్యం, రద్దు, ప్రవేశం నిరాకరణ సందర్భాలలో ప్రయాణికులకు అదనపు ప్రయోజనాలను కూడా కల్పించేలా కేంద్రం తాజా ఆదేశాలను రూపొంచింది. దీనివల్ల ప్రయాణికులపై అదనపు భారాన్ని తగ్గించడంతో పాటు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్టవుతుంది.

ఈ ఆదేశాలన్నింటినీ కూడా విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ బుకింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లు, ఇతర ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్‌లలో ప్రముఖంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ తో పాటు ప్రాంతీయ భాషలలో కూడా వీటిని తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఎంక్వైరీ కౌంటర్ లల్లో కూడా మౌఖికంగా ప్రయాణికులు వీటి గురించి అడిగినప్పుడు వివరంగా తెలియజేయాల్సి ఉంటుంది అక్కడి సిబ్బందికి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+