భద్రత విషయంలో రాజీ పడేదిలేదన్న రాజ్‌నాథ్, బీజేపీపై ఖర్గే మండిపాటు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నేత మసరాత్ ఆలంను విడుదల చేయడంపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదన్నారు. మసారత్ ఆలం విడుదలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. ఆలం విడుదలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిందన్నారు.
మసరాత్ ఆలంపై 27 కేసులున్నాయని, 27 కేసుల్లో ఆలంకు బెయిల్ లభించిందని సభకు తెలిపారు. రెండేళ్లకు పైగా ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచరాదని కోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. పూర్తి స్ధాయి నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే రాజకీయాలు మాత్రమే చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

దీనిపై లోక్ సభ విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ కాశ్మీర్‌లో ఏం జరుగుతుందో కేంద్రానికి తెలియదని చెప్పడం సరికాదన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగాలని డిమాండ్ చేశారు. అంతక ముందు మసరాత్ ఆలంలాంటి దేశ ద్రోహులను విడుదల చేయడం మంచిదికాదన్నారు.
ఇక మసరాత్ ఆలం విషాయనికి వస్తే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సహా పలు కేసుల్లో ఆయన నిందితుడు. 2008-10 మధ్య కశ్మీర్ లోయలో జరిగిన వివిధ ఆందోళనల్లో రాళ్లు విసిరిన కేసుల్లో ఆయన జైలుపాలయ్యారు.
హురియత్ కాన్ఫరెన్స్ అధినేత సయ్యద్ అలీ షా గిలానీకి అత్యంత సన్నిహుతుడిగా పేర్కొంటారు. హురియత్ కాన్ఫరెన్స్ అనుబంధ సంస్ధైన ముస్లింలీగ్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణం చేత గతంలో పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎట్టకేలకు 2010లో శ్రీనగర్ సమీపంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నేర పూరిత అభియోగాల్లేకుండా జైలులో ఉన్న వారిని విడుదలచేయాలని నిర్ణయించడంతో అతడిని విడుదల చేశారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications