టోల్ ప్లాజాలపై కేంద్రం కొత్త నిర్ణయం- ఇకపై..!!

Toll Plaza: జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాలకు చెక్ పడనుంది. ఫాస్టాగ్ విధానంలో టోల్ కలెక్షన్ల వ్యవస్థకు తెర దించబోతోంది కేంద్ర ప్రభుత్వం. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడంలో భాగంగా అత్యాధునిక పద్ధతుల్లో టోల్ ఫీజులను వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.

ప్రస్తుతం జాతీయ రహదారులపై నెలకొల్పిన ప్లాజాల వాహనాల నుంచి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొంతసేపయినా వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది.

Centre plans to introduce annual and lifetime Toll Passes

కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తుతోండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి నిల్చున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగట్లేదనే అభిప్రాయానికి వచ్చింది కేంద్రం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని- మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. ఇదివరకు జీపీఎస్ ఆధారంగా టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కన్సల్టెంట్‌ను కూడా అపాయింట్ చేసింది. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తోంది.

ఇప్పుడు కొత్తగా టోల్ పాసులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అవి కార్యాచరణలోకి వస్తే- రెండు రకాలుగా ఈ టోల్ పాసు అందుబాటులోకి ఉంటాయి. మొదటిది- వార్షిక టోల్ పాస్, రెండోది- లైఫ్ టైమ్ టోల్ పాస్. ఈ రెండింటి ద్వారా జాతీయ రహదారులపై వాహనదారులకు పదే పదే టోల్ ట్యాక్స్ కట్టే అవకాశం ఉండదు.

వార్షిక టోల్ పాస్ ధర- 3,000 రూపాయలు. దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు యథేచ్ఛగా రాకపోకలు సాగించే వీలు వాహనదారులకు ఉంటుంది. టోల్ గేట్ల గుండా ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చు. ఎక్కడే గానీ అదనంగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్‌ ప్రొవైడర్‌ అకౌంట్‌ లేదా వాలెట్‌లో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఉంచుకోనక్కర్లేదు.

లైఫ్ టైమ్ టోల్ పాస్ ధర- 30,000 రూపాయలు. దీనికి కాలపరిమితి అంటూ ఏదీ ఉండదు. జీవితాంతం టోల్ ట్యాక్స్ కట్టనక్కర్లేకుండా తిరిగేయొచ్చు. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. ఉపరితల రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+