డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీల మద్దతు, కాంగ్రెస్ కు షాక్- లెక్క పక్కా.. ముహూర్తం ఫిక్స్..!!
కేంద్రం మరో సంచలన నిర్ణయం అమలుకు రంగం సిద్దం అవుతోంది. ఒక సారి వీగిపోయినా.. ఇప్పుడు పక్కా లెక్కలతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి రెడీ అయింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అనూహ్యంగా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు కొన్ని షరతులతో బిల్లుకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమయ్యాయి. దీంతో.. మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందటం లాంఛనంగా కనిపిస్తోంది.
కేంద్రం వ్యూహాలు ఫలించాయి. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం దిశగా కసరత్తు తుది దశకు చేరింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం.. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచి మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ను అమలు చేస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల సంఖ్యా బలాన్ని కూడా పెంచి మహిళా రిజర్వేషన్ అమలుతో 2029లో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేదఫా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావటంతో ఏప్రిల్ లో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు వీగిపోయింది. కాగా.. ప్రస్తుతం సార్వత్రిక ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్)ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలకు, ప్రభుత్వానికి నడుమ ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది.

సంఖ్యా బలంతో బిల్లు ఆమోదం దిశగా
అయితే, ఈ బిల్లు ఆమోదం పొందాంటే 543 మంది సభ్యుల లోక్‌సభలో 361 మంది ఎంపీలు మద్దతివ్వాలి. సభలో ఇప్పుడు మూడు ఖాళీలున్నాయి. 540 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఎన్డీఏకి 320 మంది సభ్యుల బలముంది. ఇండీ కూటమి పార్టీల మద్దతు తప్పనిసరి. అయితే డీఎంకే, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీతో పాటు మరికొన్ని చిన్న పార్టీల మద్దతు సాధించి పార్లమెంటులో బిల్లుకు ఆమోదం పొందాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనబడుతోంది. 15 నుంచి 18 ఓట్ల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా.. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడ్డాయి. 94 రోజులు దాటినా ఇంతవరకు వాటిని ప్రొరోగ్ చేయలేదు. 2008లో కూడా యూపీఏ హయాంలో 87 రోజులపాటు ప్రొరోగ్ చేయకుండా ఆపారు. మోదీ ప్రభుత్వం దీనిని దాటేసింది. పునర్విభజన బిల్లును తక్కువ సమయంలో ఆమోదింపజేసుకోవాలంటే.. ప్రొరోగ్ చేయకుండా ఉంటే.. సమావేశాల ఏర్పాటుకు రెండ్రోజులు నోటీసిస్తే సరిపోతుంది. దీంతో.. ఇండియా కూటమిలోని పరిణామాలను తమకు అను కూలంగా మలచుకుంటూ.. బీజేపీ నాయకత్వం ఈ బిల్లును ఆమోదం పొందేలా కావాల్సిన సంఖ్యా బలం ఇప్పటికే సమకూర్చుకుంది. దీంతో.. ఈ బిల్లు ఆమోదం ఖాయమని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications
