రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివరాలను వెల్లడించిన కేంద్రం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్రం రియాక్ట్ అయ్యింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సందర్భంగా నిర్ణయాలు ఎలా తీసుకున్నారో కోరుతూ తమకు తెలపాలని పిటిషన్ వేసిన పిటిషనర్లకు కేంద్రం తాము ఏ క్రమంలో నిర్ణయాలు తీసుకున్నామో వివరిస్తూ దానికి సంబంధించిన పత్రాలను అందజేశాయి.

పిటిషనర్లకు రాఫెల్ కొనుగోలు వివరాలను తెలిపిన కేంద్రం
36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం, ఆ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు తెలియజేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్లకు డాక్యుమెంట్లు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ నిబంధనలకు అనుగుణంగానే ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని డాక్యుమెంట్లలో పేర్కొంది కేంద్రం. యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఇండియన్ నెగోషియేటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన కేంద్రం... ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒక ఏడాది పాటు చర్చలు జరిపినట్లు వెల్లడించింది. ఆ తర్వాత క్యాబినెట్ కమిటీ ముందుకు అప్రూవల్ కోసం వచ్చిందని చెప్పిన కేంద్రం.... క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపగానే ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

నవంబర్ 14కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఇక రాఫెల్ యుద్ధ విమానంకు సంబంధించిన అన్ని అంశాలు అంటే... కొనుగోలు సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో దేశ ప్రజలకు బహిర్గతం చేసేముందు పిటిషనర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాదు సీల్డ్ కవర్‌లో 36 రాఫెల్ జెట్ విమానాల ధరలను కూడా న్యాయస్థానం ముందు ఉంచాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. ఇక నవంబర్ 14కు విచారణ వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... కోర్టుకు కూడా ధరల వివరాలు తెలపరాదని కేంద్రం భావిస్తే అదే విషయం పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.

రాఫెల్ డీల్‌లో గోల్‌మాల్ జరిగింది: పిటిషనర్లు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని ఆరోపిస్తూ వాటి వివరాలను దేశ ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయవాదులు మనోహర్ లాల్ శర్మ, వినీత్ దండాలు పిటిషన్ వేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా పిటిషన్ వేయడంతో వ్యవహారం వేడెక్కింది. ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు కూడా సంయుక్తంగా పిటిషన్ వేశారు. మొత్తం 9 పేజీలతో కూడిన నివేదికను పిటిషనర్లకు అందజేసింది కేంద్రం.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications