'పోర్న్ సైట్ బ్యాన్, బెడ్ రూంలోకి పోలేం కదా!'
న్యూఢిల్లీ: పోర్న్ వెబ్ సైట్ల ను నిషేదించడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వివరణ ఇచ్చింది. దేశంలోని ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి వారి బెడ్ రూంలలోకి చూడలేము కదా అని అభిప్రాయం వ్యక్తం చేసింది. పిల్లలను చెడగొడుతున్న అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాలని సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తరుపన సోమవారం అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు హాజరైనారు. పోర్న్ వెబ్ సైట్లు, అశ్లీల వెబ్ సైట్ల నిషేదంపై పార్లమెంటులో గాని, సమాజంలో గానీ పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత వారం 850 పోర్న్ సైట్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సామాజిక మాద్యమాల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. విషయం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని వెబ్ సైట్ల పై నిషేధం ఎత్తి వేసింది.
అయితే పోర్న్ వెబ్ సైట్ల నిషేధించడం మంచిదికాదంటూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం న్యాయమూర్తి ముఖుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications