lockdown:లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంతో ఆదాయం.. రాష్ట్రాల వినతికి కేంద్రం ఓకే...
కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. దీంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే.. లాక్‌డౌన్ సడలింపులను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెడ్ జోన్ తప్ప ఆరంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వొచ్చని భావించింది. ఇప్పటికే తమకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. మద్యం షాపులను తెరిచేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. మద్యం షాపులు మూసివేయడం వల్ల నష్టపోతున్నామని కర్ణాటక కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లింది.
ప్రభుత్వాల విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కంటోన్మైంట్ జోన్లు తప్ప మిగతా చోట్ మద్యం షాపులను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. కానీ సామాజిక దూరం మాత్రం పాటించాలని తేల్చిచెప్పింది. మద్యం, పాన్ గుట్కా, బీడీ దుఖాణాలు ఆరు అడుగుల దూరంలో ఉండాలని స్పష్టంచేసింది. అలాగే ఐదుగురు కంటే ఎక్కువమంది లైన్‌లో ఉండొద్దని సూచించింది. మద్యం అమ్మకాలతో కేంద్ర, రాష్ట్ర ఖజానాకు నగదు చేరనుంది. ఇక గ్రీన్, ఆరంజ్ జోన్లలో అన్ని ఆంక్షలను ఎత్తివేశామని హోంశాఖ పేర్కొన్నది. అయితే విమాన, రైలు, విద్యాసంస్థలు, సినిమా హాల్లు, మాల్స్ మూసివేస్తామని పేర్కొన్నది.

గ్రీన్, ఆరంజ్ జోన్లలో 33 శాతం సిబ్బంది కార్యాలయాలు కూడా పనిచేసేందుకు అనుమతిచ్చింది. కానీ సెలూన్లు, హోటళ్లు, రెస్టారెంట్లను రెడ్ జోన్ పరిధిలో ఇప్పటికీ అనుమతించలేదు. కంటైన్మైంట్ జోన్లు కానీ ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, దుకాణాలను అనుమతిచ్చారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మేలు చేకూరుస్తోందని కేంద్రం భావిస్తోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications