మోడీ దీపావళి కానుక- ఇకపై రెండు జీఎస్టీ స్లాబ్ లే..! వీటిపై మాత్రం 40 శాతం బాదుడు..!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు ప్రధాని మోడీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఎర్రకోట నుంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దీపావళి నుంచి జీఎస్టీ స్లాబ్ లను తగ్గించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో కేంద్రం ఏయే స్లాబ్ లను తగ్గించబోతోంది, ఎంత మేర తగ్గించబోతోందన్న చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై కొంత మేర క్లారిటీ ఇస్తున్నాయి.
ప్రస్తుతం వివిధ వస్తు ఉత్పత్తులు, సేవలపై నాలుగు రకాల జీఎస్టీ స్లాబ్ లు అమల్లో ఉన్నాయి. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. వీటిని రెండుకు కుదించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటిలో కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్ లను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీపావళి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలో పన్ను చెల్లింపుదారులతో పాటు ప్రజలకు కూడా భారీ ఊరట దక్కనుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం పన్ను స్లాబ్ రద్దయితే దాని పరిధిలో ఉన్న 90 శాతం వస్తువులు 18 శాతం స్లాబ్ లోకి మార్చేయబోతున్నారు. అలాగే 12 శాతం స్లాబ్ లో ఉన్న వస్తువుల్లో 99 శాతం 5 శాతం స్లాబ్ లోకి మారిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే వివిధ వస్తువులు, సేవలకు పన్ను బాదుడు ఎదుర్కొంటున్న వర్గాలకు భారీ ఉపశమనం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
మరోవైపు కేంద్రం ప్రతిపాదనల్లో పొగాకు, గుట్కా, సిగరెట్లు వంటి విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేక 40శాతం రేటు వర్తింపచేయనున్నారు. 40 శాతం వర్గంలో కేవలం 5-7 వస్తువులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అయితే రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ , వాషింగ్ మెషిన్ వంటి వస్తువులు మాత్రం మినహాయిస్తారు. పెట్రో ఉత్పత్తులు మాత్రం అలాగే జీఎస్టీకి బయటే ఉంటాయి. అలాగే మొత్తం పన్నుల పరిధి ప్రస్తుత 88 శాతం వద్దే ఉండబోతోంది. తాజా మార్పులు వినియోగానికి భారీ ప్రోత్సాహం ఇస్తాయని, రేట్ల హేతుబద్ధీకరణ కారణంగా ఆదాయ నష్టం భర్తీ అవుతుందని చెప్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications