దీపక్ పడాకీకి ఇన్పోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ధన్యవాదాలు
వివిధ కంపెనీలను విలీనం చేస్తూ ఇన్పోసిస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సుదీర్ఘకాలంగా కష్టపడుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగి దీపక్ పడాకీకీ ఇన్పోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
న్యూఢిల్లీ: వివిధ కంపెనీలను విలీనం చేస్తూ ఇన్పోసిస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సుదీర్ఘకాలంగా కష్టపడుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగి దీపక్ పడాకీకీ ఇన్పోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
గత కొన్నేళ్ళుగా చాలా మంది ఉన్నతస్థాయి ఉద్యోగులు ఇన్పోసిస్ నుండి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలోనే మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ హెడ్‌గా ఉన్న దీపక్ సోషల్ మీడియా ద్వారా విశాల్ సిక్కా ధన్యవాదాలు తెలిపారు.

కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ దీపక్ 9200 రోజులుగా కంపెనీ కోసం పనిచేస్తున్నావు, ప్రతిరోజూ కంపెనీ కోసం వీలైనంత కృషి చేశావు అంటూ విశాల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
1992లో మైసూర్ యూనివర్శిటీ నుండి ఇంజనీరింగ్ పూర్తి కాగానే దీపక్ పడాకీ ఇన్పోసిస్‌లో చేరాడు.22 ఏళ్ళుగా ఆయన ఇన్పోసిస్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications