జార్ఖండ్ కొత్త సీఎంగా ‘టైగర్’ చంపై సోరెన్: హేమంత్ సోరెన్ అరెస్ట్
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్(ED) అధికారులు బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను విచారించారు. ఈ క్రమంలో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, మంగళవారమే హేమంత్ సోరెన్ తన పార్టీ జేఎంఎం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
#WATCH | Jharkhand Minister Banna Gupta says, "We have chosen Champai Soren as the leader of the Legislative Party. We came to the Raj Bhawan to request the Governor for the oath ceremony." pic.twitter.com/oH3QOprqLb
— ANI (@ANI) January 31, 2024
ఒకవేళ తాను మనీలాండరింగ్ కేసులో అరెస్టైతే ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనేదానిపై కీలకంగా చర్చించారు. ఆ తర్వాత బుధవారం ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు హేమంత్ సోరెన్. తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి రాజ్‌భవన్‌కు మినీ బస్సుల్లో వెళ్లారు. వారితోపాటు హేమంత్ సోరెన్ కూడా వెళ్లడం గమనార్హం. అయితే, జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్ సభ్యుడు చంపై సోరెన్‌ను జేఎంఎం సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిశారు జేఎంఎం ఎమ్మెల్యేలు.
#WATCH | Jharkhand Mukti Morcha MLAs arrive at Raj Bhawan, in Ranchi.
— ANI (@ANI) January 31, 2024
ED has been questioning CM Soren in connection with a money laundering case linked to an alleged land scam. pic.twitter.com/M0qnzWAVdz
మొదట హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారని అంతా అనుకున్నప్పటికీ.. ఆమె ఎమ్మెల్యే కాకపోవడం, రాజకీయ అనుభవం లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలంతా సీనియర్ సభ్యుడైన చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయించారు. ఇందుకు హేమంత్ సోరెన్ ఆమోదం లభించడంతో చంపాయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి కానున్నారు. 81 స్థానాలున్న అసెంబ్లీలో 43 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
చంపై సోరెన్ ఎవరంటే?
చంపై సోరెన్.. సెరైకెల్లా నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చంపై సోరెన్.. 'జార్ఖండ్ టైగర్'గా పేరొందారు.
హేమంత్ సోరెన్ అరెస్ట్
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) ను ఈడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు 7 గంటలపాటు విచారించిన అనంతరం హేమంత్ సోరెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమంత్ ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications