ఈ లక్షణాలున్న మహిళ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు స్వర్గమే..!
సామాజిక సంక్షేమానికి సంబంధించి ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో పలు విధానాలను అందించాడు. వీటిని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించగలిగితే అనేక సమస్యలు దూరమవుతాయి. ప్రస్తుత కాలానికి కూడా చాణక్యుడి నీతిబోధలు సరిపోతున్నాయంటే ఆయన ఎంత దూరదృష్టితో వీటిని రూపొందించారో అర్థం చేసుకోవచ్చు.
చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో చాణక్యుడు కీలకపాత్ర పోషించాడు. ఆ సమయంలోనే అనేక పుస్తకాలను రచించాడు. ఇప్పటివరకు చాణక్యుడి విధానాలను అనుసరించినవారెవరూ తమ జీవితాల్లో విఫలమవలేదు. ఆయన చెప్పినదాని ప్రకారం ఎటువంటి లక్షణాలున్న స్త్రీలను వివాహం చేసుకుంటే అదృష్టవంతులవుతారో చూద్దాం.

* ప్రశాంతంగా ఉండే స్త్రీ : కోపం మనిషికి శత్రువు. మితిమీరిన కోపంలోనే అదుపు తప్పుతాడు. అదే ప్రశాంతంగా ఉండే మహిళ.. ఆ ఇంటిని అన్ని విధాలా సంరక్షిస్తుంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు. అలాంటి నివాసాల్లో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా జీవితం సాఫీగా జరిగిపోతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
* ఇంటి పెద్దలను గౌరవించే, చిన్నవారిని ప్రేమించే స్త్రీ: ఇంటి పెద్దలను గౌరవించే, చిన్నవారిని ప్రేమగా చూసుకునే స్త్రీని వివాహం చేసుకోవడం అదృష్టం. ఇలాంటి లక్షణాలున్న మహిళ వల్ల ఇంట్లో నిత్యం ఆనందాలు తాండవమాడతాయి. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఎలాంటి సమస్యనై పరిష్కరించగలదు.
* మధురంగా మాట్లాడే స్త్రీ : మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ.. ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఆ వ్యక్తికీ మద్దతుగా నిలుస్తుంది. ఇలాంటి లక్షణాలున్న మహిళలు తమ కుటుంబ వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచుతారు. వారు ఆనందంగా ఉండటమేకాక కుటుంబ సభ్యులందరినీ ఆనందంగా ఉంచుతారు.
* సహనం గల స్త్రీ : జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడే కాకుండా అన్ని సందర్భాల్లోను సహనం పాటించే స్త్రీలు తమ జీవితంలో ఎప్పుడూ విఫలం కారు. ఓర్పు, సహనం కలిగిన మహిళలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ విజయపథంలోనే కొనసాగుతాడని చాణక్యుడు చెప్పారు.
* తన ధర్మాన్ని ఆచరించే స్త్రీ : ఏ వ్యక్తి జీవితంలో నైనా ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న మహిళ ఉంటే, అతని రాత మారిపోతుంది. సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజూ పూజలు చేస్తారు. ఇలా ప్రతిరోజూ మహిళలు పూజించే ఇళ్లల్లో దేవుడు కొలువై ఉంటాడు. అటువంటి స్త్రీలు ఉన్న మనుషుల జీవితాల్లో ప్రతి సమస్య తొలగిపోతుంది.












Click it and Unblock the Notifications