గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి గూగుల్ ఉద్యోగం.. అంతా వట్టిదే!

ఇంటర్ చదువుతుండగానే ప్రతిష్టాత్మక గూగుల్‌లో రూ.1.44 కోట్ల వార్షిక వేతనం పొందే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పదహారేళ్ల వయసులోనే ఓ విద్యార్థి పొందాడనే వార్త వైరల్ అయింది. నెటిజన్లు అభినందనలు కూడా తెలిపారు.

చండీగఢ్: ఇంటర్ చదువుతుండగానే ప్రతిష్టాత్మక గూగుల్‌లో రూ.1.44 కోట్ల వార్షిక వేతనం పొందే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పదహారేళ్ల వయసులోనే ఓ విద్యార్థి పొందాడనే వార్త వైరల్ అయింది. నెటిజన్లు అభినందనలు కూడా తెలిపారు.

కానీ, ఈ విషయానికి సంబంధించి గూగుల్ ప్రతినిధులు చెప్పిన మాట అందర్నీ షాకింగ్‌కు గురి చేసింది. ఆ కుర్రాడి ఉద్యోగ నియామకానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Chandigarh boy in news after govt says Google selected him for a special programme

అసలు ఏం జరిగిందా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి హర్షిత్ శర్మ నియామకానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అతను చదువుతున్న స్కూల్‌లో యాజమాన్యం ప్రకటన చేసినందు వల్లే ఇదంతా జరిగిందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.

ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపల్ ఇంద్రా బెనివాల్ మాట్లాడారు. ఈ సంవత్సరం ఆ కుర్రాడు ఇంటర్ పూర్తి చేశాడని, గూగుల్‌లో ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి స్కూల్‌కు వచ్చాడని తెలిపారు.

వాట్సాప్‌లో తనకు నియామక పత్రం ఇదేనంటూ ఓ పోస్ట్‌ను పెట్టాడని ఆమె చెప్పారు. అయితే అనుకోకుండా ఫోన్ నుంచి అది డిలీట్ అయిందన్నారు. ఆ లెటర్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఆ లెటర్ చేతికి రాగానే పూర్తి వివరాలు చెబుతానన్నారు. మరోవైపు, ఆ విద్యార్థి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+