వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకపై అక్కడ స్కర్టుల్లో అమ్మాయిలు కనిపించరు!

|
Google Oneindia TeluguNews

ఛండీఘర్: హర్యానా రాజధాని ఛండీఘర్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొట్టి బట్టలేసుకుని బార్లు, డిస్కోటెక్‌లకు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు.

మినీ స్కర్ట్ లు, అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి బార్లు, డిస్కోటెక్‌లకు వెళ్లడంపై నిషేధం విధించనున్నారు. 'కంట్రోలింగ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ అమూజ్‌మెంట్ 2016' కింద చర్యలు చేపట్టనున్నారు.

రాత్రి వేళల్లో పెరిగిపోతున్న అసాంఘిక, వేధింపులు, అత్యాచారాలను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. మహిళలు ఇది గుర్తించి స్కర్టులు వేసుకోవడం మానేయాలని సూచించారు.

Chandigarh nightlife to witness reduced hemline; ban on short skirts

కాగా, పబ్‌లు, డిస్కోలు వంటి స్టార్ హోటళ్లపై నియంత్రణ చర్యల పేరిట విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ విధమైన నిబంధనను పేర్కోన్నారు. పబ్స్‌లోకి స్కర్టుల వంటి కురచ దుస్తులతో అమ్మాయిలను అనుమతిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

కాగా, దీనిపై బార్ యజమానులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మోరల్ పోలీసింగ్ కిందకు వస్తుందని పేర్కొన్నారు. నేరాల అదుపు చేసేందుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని వాదిస్తున్నారు.

అసభ్యకరమైన దుస్తులు వేసుకున్నారని ఏవిధంగా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కాగా, పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు రూపొందించామని అధికారులు అంటున్నారు.

English summary
Killing the buzzing nightlife of Chandigarh, the city administration appears to have taken the onus of moral policing, ruling that scantily dressed women or any indecency would not be accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X