షాక్: పాక్ బెలూన్ల కలకలం, రెచ్చగొడుతున్నారు

చండిఘర్: పాక్ నుంచి పెద్దసంఖ్యలో బెలూన్లు ( గాలిబుడగలు) భారత్ సరిహద్దుల్లోకి వచ్చి వాలుతుండటంతో కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని సరిహద్దుల మీదుగా దాదాపు నాలుగు డజన్ల గాలిబుడగలను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

పఠాన్ కోట్, ఫీరోజ్‌పూర్‌, అమృతసర్‌ సైనిక ఔట్‌పోస్టుల వద్ద అత్యధిక సంఖ్యలో పాక్ నుంచి వచ్చిన గాలిబుడగలను బీఎస్ఎఫ్ బలగాలకు దొరికాయి. ఉర్దూలో భారత్‌ కు వ్యతిరేకంగా సందేశాలున్న కాగితాల్ని గాలిబుడగలకు కట్టి భారత్‌ వైపు పాక్ సైనికులు ఎగురవేస్తున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.

భారతీయ సైనికులు, మహిళలను తివ్ర వ్యతిరేకంగా దూషిస్తూ అసభ్య వ్యాఖ్యలతో కూడిన గాలిబుడగలు అధికసంఖ్యలో భారత్ కు వస్తున్నాయి. కొన్ని గాలిబుడగలపై భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీకి సవాళ్లు కూడా చేశారు. మోడీ పాకిస్థాన్‌ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే నువ్వు నేరుగా తలపడి చూసుకో, అంతే కాని అడ్డదార్లు వద్దూ అంటూ సవాళ్లు విసిరారు.

Chandigarh:When abuses flew into country on balloons

భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 2016 జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌ మీదుగా ప్రయాణించిన ఓ భారీ బెలూన్‌ను ఐఏఎఫ్ (భారత వైమానిక దళం) కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో తయారైన ఈ బెలూన్‌ 25వేల అడుగుల ఎత్తులో ఉండగానే ఐఏఎఫ్‌ రాడర్లు గుర్తించాయి.

పాకిస్థాన్ నుంచి బెలూన్లు వెళితే భారతదేశం స్పందన ఎలా ఉంటుంది, వాటిని ఎంతసేపటిలో గుర్తిస్తారు, అని తెలుసుకోవడానికి పాకిస్థాన్ సైన్యం ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతుందని భారత్ సైనికాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+