హెల్త్‌పై మోడీ ఆరా: బాబుకు బలవంతంగా (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమ ోడీ ఫోన్ చేసి ఆరోగ్యంపై వాకబు చేశారు. బాబు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షఇంచారు.
తెలుగు ప్రజలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తు సోమవారం ఎపి భవన్లో చంద్రబాబు నాయుడు దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయనను దీక్షా ప్రాంగణం నుండి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తీసుకు పోయారు. ఆసుపత్రిలో బాబు ఫ్లూయిడ్స్‌ను నిరాకరించారు.
శనివారం చంద్రబాబు ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోలీసులు, వైద్యులు బలవంతంగా ఆయనకు ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఈ రోజు లేదా రేపు హైదరాబాదుకు రానున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఫోన్ చేసి బాబు ఆరోగ్యంపై వాకబు చేశారు.

మోడీ - బాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఆరోగ్యంపై వాకబు చేశారు.

బాబుకు పరీక్షలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు శనివారం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్న ఆసుపత్రి వైద్యులు.

వైద్యులతో బాబు
తాను తన దీక్షను కొనసాగిస్తానని, తనకు ఫ్లూయిడ్స్ ఎక్కించవద్దని వైద్యులకు చెబుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని తాను తన దీక్షను కొనసాగిస్తానని, తనకు ఫ్లూయిడ్స్ ఎక్కించవద్దని వైద్యులకు చెబుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

వైద్యుల రిపోర్ట్ 1
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని శనివారం పరీక్షించిన అనంతరం నివేదిక ఇచ్చిన వైద్యుల బృందం.

వైద్యుల రిపోర్ట్ 2
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని శనివారం పరీక్షించిన అనంతరం నివేదిక ఇచ్చిన వైద్యుల బృందం.

ఫ్లూయిడ్స్
శనివారం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు బలవంతంగా ఆయనకు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.












Click it and Unblock the Notifications