CCTV: గురూజీ హంతకులు గంటల్లో చిక్కిపోయి ?, గురూజీ అపార్ట్ మెంట్ లో హంతకుడి భార్యతో !

హుబ్బళి/బెంగళూరు: దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కర్ణాటకకు చెందిన ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని కిరాతకంగా హత్య చేసిన నిందితులను హుబ్బళి పోలీసులు అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంగా పని చేస్తూ ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా 40 సెకన్లలో 60 సార్లు పొడిచి చంపేసి చాకచక్యంగా తప్పించుకున్న నిందితుల మీద హుబ్బళి పోలీసులు పంజా విసిరారు. చంద్రశేఖర్ గురూజీని హత్య చేసిన కొన్ని గంటల్లోనే హంతకులను హుబ్బళి పోలీసులు పట్టుకున్నారు. గురూజీ సొంత అపార్ట్ మెంట్ లోనే హంతకుడు అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. హంతకుడి అపార్ట్ మెంట్ వెనుక అపార్ట్ మెంట్ లో చంద్రశేఖర్ గురూజీ నివాసం ఉంటున్నారు.

 పట్టపగలు బరితెగించిన శిష్యులు

పట్టపగలు బరితెగించిన శిష్యులు

కర్ణాటకలోని హుబ్బళి నగరంలోని ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గురూజీని హత్య చేసిన నిందితులను పట్టుకోవడానికి హోటల్ సిబ్బంది ధైర్యం చెయ్యలేకపోయారు.

 అలర్ట్ అయిన పోలీసు కమీషనర్

అలర్ట్ అయిన పోలీసు కమీషనర్

చంద్రశేఖర్ గురూజీ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్ అనే వ్యక్తి,, అతని అనుచరుడు మంజునాథ్ మరెవాడా కలిసి హత్య చేశారని, ఆ విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. వెంటనే నిందితులను పట్టుకోవడానికి హుబ్బళి-ధారవాడ ఎస్పీ లాబూరామ్ ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలించారు.

 నమ్మినందుకు చంపేసిన శిష్యుడు

నమ్మినందుకు చంపేసిన శిష్యుడు

చంద్రశేఖర్ గురూజీని ఆయన దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్, అతని అనుచరుడు మంజునాథ్ మరెవాడా హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో హుబ్బళిలోని విద్యానగర పోలీసులు అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ గురూజీ దగ్గర మహంతేష్ చాలా నమ్మకంగా పని చేస్తున్నాడని పోలీసులు అన్నారు.

 గురూజీ సొంత ఫ్లాట్ లో హంతకుడు నివాసం

గురూజీ సొంత ఫ్లాట్ లో హంతకుడు నివాసం


చంద్రశేఖర్ గురూజీ ఆయన శిష్యుడు మహంతేష్ కు పెళ్లి చేశాడని పోలీసులు అన్నారు. హుబ్బళిలోని గోకుల్ రోడ్డులోని డెక్తాన్ వెనుక భాగంలోని చంద్రశేఖర్ గురూజీ సొంత అపార్ట్ మెంట్ లో మహంతేష్, అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. మహంతేష్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వెనుక వైపు ఉన్న మరో అపార్ట్ మెంట్ లో చంద్రశేఖర్ గురూజీ నివాసం ఉంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

 హంతకుడి భార్య ఎందుకు ఉద్యోగం మానేసింది ?

హంతకుడి భార్య ఎందుకు ఉద్యోగం మానేసింది ?

2019 సంవత్సరం వరకు మహంతేష్ భార్య చంద్రశేఖర్ గురూజీ దగ్గర ఉద్యోగం చేసిందని, తరువాత ఆమె గురూజీ దగ్గర ఉద్యోగం మూనేసిందని పోలీసు అధికారులు తెలిపారు. 2016 నుంచి చంద్రశేఖర్ గురూజీ దగ్గర మహంతేష్ చాలా నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+