Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేరా భారత్ మహాన్ : చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్..అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత్

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగం ఇస్రో మరో రికార్డును సొంతం చేసుంది. ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై పరిశోధనలు చేశాయి. తాజాగా చంద్రయాన్-2 నింగిలోకి పంపి ప్రపంచదేశాల సరసన భారత్ చేరింది. చంద్రుడి ఆవిర్భావం గురించి చంద్రమండలంపై విశేషాలను కనుగొనేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-2ను నింగిలోకి పంపింది. ఆదివారమే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల43 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ముఖ్య పాత్ర పోషించే ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను నింగిలోకి జీఎస్ఎల్‌వీ ఎంకే-3 రాకెట్ మోసుకెళ్లింది. షెడ్యూల్ ప్రకారం జూలై 15న తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు టేకాఫ్ తీసుకోవాల్సిన చంద్రయాన్-2 సాంకేతిక లోపం తలెత్తడంతో 22వ తేదీకి వాయిదా పడింది

Recommended Video

    ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి

    ఇక మొత్తం 48 రోజుల పాటు చంద్రయాన్-2 ప్రయాణం ఉంటుంది. చంద్రుడిపై ఓ స్పేస్ క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. చంద్రయాన్ -2 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంలో జరిగే విషయాలను స్టడీ చేయనున్నారు. అక్కడే ఎక్కువగా నీటి ఆనవాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2008 అక్టోబర్ 22వ తేదీన చంద్రయాన్-1ను ఇస్రో నింగిలోకి పంపింది.

    chandrayaan-2-launch-live-india-gets-set-for-second-lunar-exploration-mission

    Jul 22, 2019, 3:34 pm IST

    చంద్రయాన్-2 సక్సెస్ పై అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
    Jul 22, 2019, 3:31 pm IST

    చంద్రుడిపై ఏర్పడే ప్రకంపనాలను కూడా రోవర్ రికార్డు చేయగలదు: నిపుణులు
    Jul 22, 2019, 3:30 pm IST

    చంద్రుడి దక్షిణ ధృవం దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి మిషన్ ప్రయోగాలు చేపట్టలేదు. తొలిసారిగా చంద్రయాన్-2 ఈ సాహసం చేయనుంది: ప్రధాని మోడీ
    Jul 22, 2019, 3:27 pm IST

    ఇలాంటి ప్రయోగాల ద్వారా యువత అంతరిక్ష రంగం వైపు మొగ్గు చూపుతారు: ప్రధాని మోడీ
    Jul 22, 2019, 3:27 pm IST

    చంద్రయాన్-2 ప్రయోగం ప్రతి భారత పౌరుడికి గర్వకారణం: ప్రధాని మోడీ
    Jul 22, 2019, 3:26 pm IST

    చంద్రయాన్-2 మిషన్‌ను వీక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
    Jul 22, 2019, 3:16 pm IST

    లాంచ్ వెహికల్ టేకాఫ్ తీసుకున్న 16 నిమిషాలకు నిర్దిష్ట భూకక్షలోకి చంద్రయాన్ -2 ప్రవేశం
    Jul 22, 2019, 3:13 pm IST

    ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు మరో 15 అడ్డంకులు దాటాల్సి ఉంది: ఇస్రో ఛైర్మెన్
    Jul 22, 2019, 3:10 pm IST

    ప్రపంచ దేశాలన్నీ ఈ విజయం కోసం ఎదురుచూశాయి: ఇస్రో ఛైర్మెన్
    Jul 22, 2019, 3:10 pm IST

    రానున్న నెలన్నర రోజులు చంద్రయాన్-2కు సంబంధించి శాస్త్రవేత్తలు అణుక్షణం పనిచేస్తారు: ఇస్రో ఛైర్మెన్ శివన్
    Jul 22, 2019, 3:08 pm IST

    భూకక్షలోకి చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రవేశపెట్టిన జీఎస్ఎల్‌వీ ఎంకే-III వెహికల్
    Jul 22, 2019, 3:07 pm IST

    సాంకేతికలోపం తలెత్తినప్పుడు శాస్త్రవేత్తలు కుటుంబాలను సైతం మరిచి ఈ విజయం కోసం కృషి చేశారు: ఇస్రో ఛైర్మెన్ శివన్
    Jul 22, 2019, 3:06 pm IST

    చంద్రయాన్-2 ప్రాజెక్టు ఖర్చు రూ.1000 కోట్లు
    Jul 22, 2019, 3:02 pm IST

    చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్..శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో ఛైర్మెన్ కే శివన్
    Jul 22, 2019, 2:57 pm IST

    ట్రాజెక్టరీ స్టేజ్ కు చేరుకునేందుకు మరో రెండు నిమిషాల సమయం
    Jul 22, 2019, 2:47 pm IST

    వేరు అయిన పేలోడ్ ఫైరింగ్..ఎల్ 1 10 పర్ఫార్మెన్స్ నార్మల్
    Jul 22, 2019, 2:44 pm IST

    నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్-2
    Jul 22, 2019, 2:32 pm IST

    చంద్రయాన్ -2కు అన్ని ఏర్పాట్లు పూర్తి.. చివరిసారిగా చంద్రయాన్-2ను చెక్ చేసిన మహిళా శాస్త్రవేత్త రితూ కరిధాల్
    Jul 22, 2019, 1:58 pm IST

    చంద్రయాన్-2లో పూర్తయిన లిక్విడ్ హైడ్రోజన్ నింపే ప్రక్రియ
    Jul 22, 2019, 1:55 pm IST

    మరో గంట సమయంలో టేకాఫ్ కానున్న చంద్రయాన్-2
    Jul 22, 2019, 1:54 pm IST

    భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం దాదాపు 3లక్షల 84వేల కిలోమీటర్లు. చంద్రయాన్ ఈ కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రుడిపై 48వ రోజున విక్రమ్ ల్యాండర్ చేరుకుంటుంది.
    Jul 22, 2019, 12:20 pm IST

    జీఎస్‌ఎల్‌వీ-ఎంకే III లాంచ్ వెహికిల్‌లో లిక్విడ్ హైడ్రోజన నింపే ప్రక్రియ ప్రారంభం
    Jul 22, 2019, 10:22 am IST

    చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు షార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుుకున్న విద్యార్థులు ఔత్సాహికులు.శ్రీహరికోటలో నెలకొన్న సందడి వాతావరణం
    Jul 22, 2019, 9:33 am IST

    చంద్రయాన్ 2 బృందంలో 30 శాతం మంది మహిళలు ఉన్నారు.
    Jul 22, 2019, 9:32 am IST

    చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి, ఆ సమాచారాన్ని, ఫోటోలను పంపిస్తుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధిస్తుంది.
    Jul 22, 2019, 9:21 am IST

    చంద్రుడిపై దిగనున్న రోవర్ సెకనుకు సెం.మీ. వేగంతో పద్నాలుగు రోజుల పాటు పయనించనుంది.
    Jul 22, 2019, 9:17 am IST

    చంద్రయాన్ 2ను ప్రయోగానికి కేవలం ఒక్క నిమిషం లాంచ్‌ విండో అందుబాటులో ఉందని, అయినప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తామని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది.
    Jul 22, 2019, 9:11 am IST

    రాకెట్ ప్రయోగం తర్వాత 16.13 నిమిషాలు ప్రయాణించి, నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం చంద్రయాన్ 2 రాకెట్‌ నుంచి విడిపోతుంది.
    Jul 22, 2019, 9:07 am IST

    సోమవారం మధ్యాహ్నం గం.2.43కు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 ప్రయోగం జరగనుంది.
    Jul 22, 2019, 9:06 am IST

    ఆదివారం సాయంత్రం గం.6.43కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 20 గంటలు కొనసాగి నింగిలోకి వెళ్తుంది.
    READ MORE

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+